వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రైమ్ నంబర్ 04: కింజరాపు సురేష్ ఎవరు? అచ్చెన్న అరెస్టు సమాచారం: ఏసీబీ డీఎస్పీ ఎవరంటే?

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభలో ఆ పార్టీ ఉప నాయకుడు, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలను పుట్టించింది. ఉరుము లేని పిడుగులాగా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలకు కేంద్రబిందువుగా మారుతోంది..క్రమక్రమంగా. అచ్చెన్నాయుడి తరువాత మరో మాజీమంత్రి, ఆయన కుమారుడిని కూడా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అదుపులోకి తీసుకోవచ్చనే ప్రచారం సాగుతోంది.

 టీడీపీలో భూకంపం: అచ్చెన్నాయుడు కిడ్నాప్: బీసీల అణచివేత: జగన్ పిచ్చి పీక్స్‌లో: చంద్రబాబు టీడీపీలో భూకంపం: అచ్చెన్నాయుడు కిడ్నాప్: బీసీల అణచివేత: జగన్ పిచ్చి పీక్స్‌లో: చంద్రబాబు

 కింజరాపు సురేష్‌కు సమాచారం..

కింజరాపు సురేష్‌కు సమాచారం..

ఇదిలావుండగా- అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంలో కొత్తగా కింజరాపు సురేష్ కుమార్ పేరు వినిపించింది. అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన సమాచారాన్ని ఏసీబీ అధికారులు అధికారికంగా ఆయనకే అందజేశారు. అచ్చెన్నాయుడి అరెస్టు సమాచారం తనకు అందినట్లుగా కింజరాపు సురేష్‌కుమార్ ఏసీబీ అధికారులు ఇచ్చిన సమాచారంపై సంతకం కూడా చేశారు. సురేష్ కుమార్.. అచ్చెన్నాయుడి సోదరుడు హరి వరప్రసాద్ కుమారుడు.

 ఉదయం 7:20 నిమిషాలకు నిమ్మాడలో

ఉదయం 7:20 నిమిషాలకు నిమ్మాడలో

ఈఎస్ఐలో వందల కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఈ ఉదయం సరిగ్గా 7:20 నిమిషాలకు ఆయనను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ గ్రామంలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం కార్యాలయం సీఐయూ యూనిట్ డీఎస్సీ టీఎస్ఆర్‌కే ప్రసాద్.. ఆయనను అరెస్టు చేశారు.

అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే..

అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే..

అవినీతి నిరోధక శాఖలోని పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 04/ఆర్‌సీఓ-సీఐయూ-ఏసీబీ/20202 యు/ఎస్ 13 (1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13 (2) ఏసీబీ పీసీ సవరణల చట్టం-2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం.. సెక్షన్ 408, సెక్షన్ 420, 120-బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. వాటిల్లో కొన్ని ఆర్థిక మోసాలకు సంబంధించినవిగా తెలుస్తోంది.

Recommended Video

TDP State President Post : Kinjarapu Rammohan Naidu Given Clarification

తిరుపతి కదిలిన డొంక

అచ్చెన్నాయుడికి సంబంధించిన కీలక సమాచారం తిరుపతిలో లభించినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోన్న తిరుపతికి చెందిన ఓ డాక్టర్‌ను విచారణ చేసిన సమయంలో అచ్చెన్నాయుడి జోక్యంపై ఆధారాలు దొరికినట్లు చెబుతున్నారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్లే భారీ నిధులతో పరికరాలు కొనుగోలు చేయాల్సి వచ్చినట్లు ఆ డాక్టర్ అంగీకరించారని అంటున్నారు. అచ్చెన్నాయుడి ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలను అందజేశారని చెబుతున్నారు.

English summary
Anti Corruption Bureau (ACB) Officials officially giving information to Ex Minister Atchannaidu's family member on his arrest. K Suresh Kumar, family member of Atchannaidu was receiving the letter given by the ACB Officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X