వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి తప్పిన పెద్ద ప్రమాదం

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు పెద్ద ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతుండగా నక్కపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఎదరుగు వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆయనకు నక్కపల్లిలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. కాగా, అచ్చెన్నాయుడు సోదరుడు, టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలోనే మరణించిన విషయం తెలిసిందే.

 atchannaidu escaped from a road accident

చంద్రబాబుపై లాఠీలు విసిరిందెవరు?

ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాజధానిలో పర్యటిస్తుండగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బస్సుపై పోలీస్ లాఠీ విసిరారు.. అది ఎవరు వేశారో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై దాడి ఘటనను పార్లమెంటులో ప్రస్తావిస్తామని అన్నారు.

చంద్రబాబుపై దాడికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ సవాంగ్ బాధ్యత వహించాలన్నారు. డీజీపీ ప్రకటన ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రాజధాని ప్రాంత ప్రజలకు ఆగ్రహం ఉంటే అన్ని చోట్లా దాడి జరిగాలి కాదా? అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో కూడా తాము నిరసనలు తెలుపుతామని, వీటికీ డీజీపీ అనుమతి ఇవ్వకపోతే.. ఆయన్ను కూడా వైసీపీ కార్యకర్తగా పరిగణిస్తామని అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ పక్కన అనువాదకుడిని పెట్టుకుని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. టీడీపీ ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తే.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

English summary
atchannaidu escaped from a road accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X