• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదే

|

ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నిక సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శ-ప్రతివిమర్శలతోపాటు సవాళ్లు- ప్రతిసవాళ్లూ తారాస్థాయికి చేరాయి. శనివారం నాటి పోలింగ్ కు ఈసీ ఏర్పాట్లు పూర్తిచేస్తుండగా, గురువారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఎన్నికల వేడిని మరింతపెంచుతూ 'అచ్చెన్నాయుడు వీడియో లీక్', 'వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు' అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. వీటిపై టీడీపీ నేతలకు కౌంటరిచ్చే క్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు..

ఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూ

డ్యామేజ్ కంట్రోల్ డ్రామా

డ్యామేజ్ కంట్రోల్ డ్రామా

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రెండేళ్లయినా విచారణ అతీగతీ లేకుండా సాగుతున్నదని, నాటి ఉదంతంలో కుటుంబీకుల పాత్ర ఉందని, న్యాయం జరగట్లేదంటూ స్వయంగా వివేకా కూతురే వాపోవడమే ఇందుకు నిదర్శనమని, వివేకా హత్య కేసుతో సంబంధం లేదని తిరుమల వెంకన్నపై ఒట్టేసి జగన్ ప్రమాణం చేయగలరా? అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సవాలు విసరడం తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబుపై అనుమానిత రాళ్ల దాడి, ఆ వెంటనే అచ్చెన్నాయుడు వీడియో లీక్ ఘటనల తర్వాత లోకేశ్ తన సవాళ్లను ఇంకాస్త రెట్టించారు. సీఎం జగన్ తక్షణమే ప్రమాణం చేయకుంటే వివేకా హత్యతో సంబంధం ఉందని ఒప్పుకున్నట్లేననీ అన్నారు. వీటికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటరిచ్చారు. డ్యామేజ్ కంట్రోల్ డ్రామా వేసుకోమంటూ లోకేశ్ కు చురకలేశారు..

ప్రభాస్ డైలాగ్‌.. జగన్ పెట్టుబడి..

ప్రభాస్ డైలాగ్‌.. జగన్ పెట్టుబడి..

‘‘జగన్ గారికి సవాళ్లు విసిరే స్థాయా నీది చిట్టినాయుడూ! నీ జాతకమేంటో మీ పార్టీ నేతలే విప్పుతున్నారు. నీ పార్టీ ఏపీ అధ్యక్షుడే - "ఆయనే ఉంటే" అన్నట్లు మాట్లాడుతున్నాడు. నీవు తిరుపతిలో ఉంటే ఏంటి? తింటూ ఉంటే ఏంటి? డ్యామేజీ కంట్రోల్ కోసం వెళ్లి డ్రామాలేసుకో. ఇక్కడకు వచ్చి ప్రమాణం చెయ్యి. గంటలో రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే-పప్పు నాయుడు ఉవాచ. ఓట్ల కోసం చిల్లర డ్రామాలు ఆపు చిట్టి - నీ పచ్చ మీడియా వర్తమానాలకు పడిపోయేవారు లేరిక్కడ. వైసీపీలో ఒట్టేసి ఒకమాట, ఒట్టేయకుండా ఒకమాట చెప్పే సంస్కృతి లేదు. విశ్వసనీయతే పెట్టుబడి ఇక్కడ'' అని సాయిరెడ్డి పేర్కొన్నారు.

అంబేద్కర్‌పై సీజేఐ అనూహ్య క్లెయిమ్ -సంస్కృతం అధికార భాషగా ప్రతిపాదన చేశారన్న జస్టిస్ బోబ్డేఅంబేద్కర్‌పై సీజేఐ అనూహ్య క్లెయిమ్ -సంస్కృతం అధికార భాషగా ప్రతిపాదన చేశారన్న జస్టిస్ బోబ్డే

గొడ్డలి వేటు.. గుండెపోటు..

గొడ్డలి వేటు.. గుండెపోటు..

ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై టీడీపీ నేతలతోపాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ, నాటి విజయసాయిరెడ్డి ప్రకటనను ప్రస్తావిస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజు, పులివెందులలోని ఇంటికి పోలీసుల కంటే ముందే డాక్టర్లు వెళ్లినా, గొడ్డలి వేటును గుర్తించకపోవడం ఆశ్చర్యకరమని, హత్య విషయం బయటికొచ్చిన కొద్ది గంటలకే వివేకా గుండెపోటుతో మరణించారని సాయిరెడ్డి మీడియాకు చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లయిందని రఘురామ వాదిస్తున్నారు. లోకేశ్ సవాలుకు కౌంటరిచ్చిన సాయిరెడ్డి తాను స్వయంగా చేసిన ‘గుండెపోటు ప్రకటన'పై గప్ చుప్ అయ్యారంటూ ఆయన పోస్టులకు కామెంట్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే

చంద్రబాబుపై దాడిని మల్లెల బాబ్జీ కేసుతో..

చంద్రబాబుపై దాడిని మల్లెల బాబ్జీ కేసుతో..

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ చీఫ్ చంద్రబాబుపై అనుమానిత రాళ్ల దాడి జరగడం, దానిని సీరియస్ గా తీసుకున్న టీడీపీ నేతలు.. ఢిల్లీ వెళ్లి ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అయితే బాబుపై దాడిని మల్లెల బాబ్జీ కేసుతో పోల్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 1984లో ఎన్టీఆర్ పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ తర్వాతి కాలంలో ఆత్మహత్యకు పాల్పడటం, కొందరి ప్రోద్బలంతోనే బాబ్జీ ఫేక్ హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడం విదితమే. ‘‘కుట్రలతోనే జీవితంలో ఎగబాకిన వాడికి ప్రతిదీ కుట్రలాగే కనిపిస్తుంది. మల్లెల బాబ్జీ కేసు ఇప్పటి తరానికి తెలియక పోయినా బాబు కుట్ర బుద్ధులు తెలిసిన వారందరికీ గుర్తుంది.

ఇలాంటి డ్రామాలు ఇంకా ఉంటాయి. రాజకీయాలను వినోద క్రీడగా మార్చడంలో తండ్రీకొడుకులు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. గెలవలేని ఎన్నికల్లో సానుభూతి కోసం తండ్రీకొడుకులు ఎదో రచ్చ చేస్తారని ఊహించిందే . అందుకే రాయి విసిరారని కొత్త రచ్చ మొదలెట్టాడు. మొన్న తిరుపతి ఎయిర్పోర్ట్ లో నాటకాలు, నిన్న బెనిఫిట్ షో అంటూ షో చేసినా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు ఇలా మొదలెట్టాడు - ఇంకెన్ని చూడాలో?'' అని సాయిరెడ్డి మండిపడ్డారు.

  GVMC Elections : Nobody Can Stop TDP Victory - Chandrababu Naidu
  అచ్చెన్నకు సాయిరెడ్డి కితాబు.. పార్టీ మార్పు?

  అచ్చెన్నకు సాయిరెడ్డి కితాబు.. పార్టీ మార్పు?

  ఏపీ టీడపీ చీఫ్ అచ్చెన్నాయుడు తిరుపతి లోని ఓ హోటల్ లో పార్టీకే చెందిన ఆకుల వెంకటేశ్వరరావుతో సంభాషించిన వీడియో ఒకటి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. పార్టీ లేదు, బొక్కా లేదు, లోకేశ్ బాగుంటే టీడీపీకి దుస్థితి వచ్చేదేకాదని అచ్చెన్న అన్నట్లుగా వీడియోలో రికార్డయింది. వైసీపీ వాళ్లు దురుద్దేశపూర్వకంగా సంభాషణను వక్రీకరించారని, లోకేశ్ తో అనుబంధం విడదీయరానిదని అచ్చెన్న వివరణ ఇచ్చారు.

  దీనిపై సాయిరెడ్డి తనదైన శైలిలో.. ‘‘17 తర్వాత...అంటే తిరుపతి ఉపఎన్నిక తర్వాత తెలుగు దేశం పార్టీ లేదు, బొక్కా లేదన్నాడు అచ్చెన్న ?సరైనోడైతే అంటూ లోకేశ్ విషయం కూడా బయటపెట్టాడు. శభాష్ అచ్చన్న! నిజాలు చెప్పినందుకు. అచ్చన్న కూడా టీడీపీని వదిలేస్తాడా? తిరుపతి ప్రచారమంతా డ్రామానేనా?'' అని సెటైర్లు వేశారు. ‘‘అచ్చెన్నను అంతగా పొడుతున్న మీరు.. ఆయనను వైసీపీలోకి చేర్చుకుంటారా? ఏప్రిల్ 17 తర్వాత అచ్చెన్న వైసీపీలోకి చేరుతారా?'' అంటూ సాయిరెడ్డి పోస్టుకు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

  English summary
  ysrcp mp vijaya sai reddy appreciates ap tdp chief atchannaidu for exposing nara lokesh in an alleged video leaked, in which atchannaidu claims tdp will finish after tirupati by election. responding to nara lokesh's promise challenge to ap cm ys jagan on ys vivekananda murder case on thursday, sai reddy slams tdp leader.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X