వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలకో రూల్, వైసీపీ నేతలకో రూలా !! ఆ మంత్రిని క్వారంటైన్ చెయ్యరా !! : అచ్చెన్నాయుడు

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసులు పెరగటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కరోనా వైరస్ కేసులు నమోదు నాటి నుండి నేటి వరకు పలు అంశాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి ఉచిత సలహాలు, సూచనలు ఇస్తున్నారని చంద్రబాబు అక్కడ కూర్చుని ఉచిత సలహాలు ఇవ్వటం మంచిది కాదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

చంద్రబాబుకు కరోనా టెస్టులు చేయించాలని, ఇక ఒకవేళ చంద్రబాబు ఏపీకి వస్తే క్వారంటైన్ కు పంపుతామని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ సమయంలో వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ వెళ్ళి రావటం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించటం పై టీడీపీ నేత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.

ఆయన ఈ వ్యవహారంపై స్పందిస్తూ ప్రజలకి వర్తించే రూల్స్ వైసీపీ నాయకులకు వర్తించవా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుండి పర్మిషన్ లెటర్ తీసుకుని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను బోర్డర్ లో ఆపేశారు. వారు నానా ఇబ్బందులు పడుతున్నా కనీస ఏర్పాట్లు చెయ్యకుండా గంటల తరబడి గర్భిణీ స్త్రీలను,విద్యార్థులను రోడ్ల పై కూర్చోబెట్టారు.

Atchennaidu questioned lock down Rule only for the people, not for the YCP leaders ?

ఇక వారిని క్వారంటైన్ కి వెళితే కానీ రాష్ట్రంలోకి అనుమతించం అని చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు .ప్రజారోగ్యం దృష్ట్యా నిర్ణయాన్ని అందరూ అంగీకరించారు.

ఇక ప్రతిపక్ష నేత , మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి వచ్చినా క్వారంటైన్ కి వెళ్లి రావాల్సిందే అని వైసీపీ మంత్రి మోపిదేవి సెలవిచ్చారు. ఇంతా చెప్పిన వారికి లాక్ డౌన్ నిబంధనలను బ్రేక్ చేసిన మంత్రివర్యులు కనిపించటం లేదా అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు . మరి ఈ నిబంధనలు వైసీపీ నాయకులకు,మంత్రులకు వర్తించవు కాబోలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ ఎలా వెళ్లారుఅని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు మంత్రి అక్కడ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారని పేర్కొన్నారు .మరి ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చేప్పుడు ఈ ప్రభుత్వం మంత్రిని క్వారంటైన్ కి పంపుతుందా? అంటూ నిలదీశారు .

English summary
The leader of the opposition, former CM Chandrababu should come to the state to come to Quarantine, YCP Minister Mopidevi said. All those who questioned whether the ministers who broke the lock-down norms were appearing or not. Atchennaidu was angry that the regulations would not apply to YCP leaders and ministers ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X