కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొదలైన వైసీపి నేతల దౌర్జన్యాలు..! సోలార్‌ కాంట్రాక్టుల కోసం కంపెనీలకు బెదిరింపులు..!!

|
Google Oneindia TeluguNews

కర్నూలు/హైదరాబాద్ : ఏపిలో వైసీపి ప్రభుత్వం కొలువుదీరి రెండునెలలు కాక ముందే నేదలు దౌర్జన్యాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. చిన్న ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా తమకే దక్కాలని అటు ప్రభుత్వ అదికారుల మీద, ఇటు కంపెనీ యాజమాన్యాల మీద జులుం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నూలు లో జరిగిన ఓ సంఘటన అదికార పార్టీ నేతల పరాకాష్ఠకు అద్దం పడుతోందని కాంపెనీ ప్రతినిధులు చెప్పుకొస్తున్నారు. కర్నూలు జిల్లాకు తలమానికంగా ఉన్న మెగా ఆల్ట్రా సోలార్‌ పార్కులో వైసీపీ నాయకులు బెదిరింపుల పర్వానికి తెర తీశారు.

కాంట్రాక్టులు తమకే ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. గడివేముల, ఓర్వకల్లు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో మెగా ఆలా్ట్ర సోలార్‌ పార్కును నిర్మించారు. ఇందులో నాలుగు కంపెనీలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీ 350 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీలో ఏడు బ్లాక్‌లలో సోలార్‌ పలకలు ఉన్నాయి. వీటిని శుభ్రంచేసే పని కంపెనీ ప్రతినిధులు కాంట్రాక్టర్లకు అప్పగించారు.

Recommended Video

టీడీపీ కార్యకర్త పోలంలో బోరు బావి, సొలార్ ను ద్వంసం చేసిన ప్రత్యర్థులు
Atrocities of YCP leaders.!Threats to companies for solar contracts..!!

ఈ కాంట్రాక్టులు తమకే ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను గని గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు శివానందరెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, మంచాలకట్టకు చెందిన అనిల్‌ కుమార్‌రెడ్డి, మేఘనాథ్‌రెడ్డి గురువారం బెదిరించారు. కంపెనీ ప్రతినిధులను కార్యాలయం నుంచి బయటకు పంపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నలుగురిపై కేసు నమోదు చేసి అనిల్‌కుమార్‌రెడ్డి, మేఘనాథరెడ్డి వద్ద ఉన్న లైసెన్స్‌డు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. మరింత లోతైన విచారణ జరిపి ఈ సఘటన వెనక ఎవరున్నారో నిగ్గు తేలుస్తామని, ఇంకెంతమందికి సంభందాలు ఉన్నాయో తేలుస్తామని స్పష్టం చేసారు.

English summary
YCP leaders in the Mega Ultra Solar Park, headquartered in Kurnool Contracts have been entered into with the company's representatives to pay for them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X