శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి కార్యాల‌యం పై దాడి : ఐర‌న్ రాడ్ల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా : కార్య‌క‌ర్త‌ల‌కు గాయాలు..!

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం జిల్లా కోట‌బొమ్మాళి లో వైసిపి - టిడిపి శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఫ్లెక్సీ తొలిగింపు తో మొదలై న ఈ గొడ‌వ రాడ్ల‌తో కొట్టుకొనే వ‌ర‌కు వెళ్లింది. కోటబొమ్మాళి వైసిపి కార్యాల‌యం వ‌ద్ద‌కు వ‌చ్చిన టిడిపి నేత‌లు అక్క‌డి వైసిపి కార్య‌క‌ర్త‌ల పై దాడి చేసారు. దీంతో..ఆరుగురు వైసిపి కార్య‌క‌ర్త‌లకు గాయాల‌య్యాయి.

వైసిపి కార్యాల‌యం పై దాడి

వైసిపి కార్యాల‌యం పై దాడి

శ్రీకాకులం జిల్లాలో ఎన్నిక‌ల కు ముందుగానే ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. కోట‌బొమ్మాళి లో ఓ ఫ్లెక్సీ తొలిగింపు వ్య‌వ హారం పై వైసిపి - టిడిపి శ్రేణుల మ‌ద్య గొడ‌వ మొద‌లైంది. ఈ గొడ‌వ పెద్ద‌దై రాడ్ల‌తో దాడి చేసుకొనే వ‌ర‌కూ వెళ్లింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

టీడీపీ నేత

టీడీపీ నేత

వివరాల్లోకి వెళితే... కోటబొమ్మాళి మండల వైఎస్సార్ సీపీ కార్యాలయంపై గురువారం ఉదయం టీడీపీ నేత బోయిన రమేష్‌ ఆధ్వర్యంలో దాడి చేశారు. ముందుగా పార్టీ కార్యాలయంలోకి దూసుకు వెళ్లి... ఫర్నిచర్‌తో పాటు కొన్ని ఫైల్స్ ధ్వంసం చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు వైఎస్సార్ కార్యకర్తలపై కర్రలు, ఐరన్‌ రాడ్లుతో దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా రక్తం వచ్చేలా కొట‍్టారని వైసిపి కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు.

స్పందించ‌ని పోలీసులు..

స్పందించ‌ని పోలీసులు..

కోట‌బొమ్మాలి వైసిపి కార్యాల‌యానికి ...కేవలం అయిదు వందల మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్‌ ఉంది. అయితే ఇప్పటివరకూ ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అంతేకాకుండా దాడి చేసుకునేందుకే మీరంతా ఇక్కడ ఉన్నారా అంటూ సీఐ ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆరోపించారు. అంతే కా కుండా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడి చేశారని వైసిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. కొద్ది సేప‌టి త‌రువాత పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. దీనికి నిర‌స‌న‌గా వైసిపి కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు.

English summary
TDP followers attack on YCP office in Kotabommali in Srikakulam dist. In this attack six persons from ycp seriously injured and join in tekkali hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X