వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అడ్డంగా దొరికారు: 40 ఇయర్స్ ఇండస్ట్రీని తప్పుదోవపట్టిస్తుందెవరు..?

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో సెల్ఫ్ గోల్స్ ఎక్కువ వేసుకుంటున్నారు. సీఎంగా ఉన్నప్పటి కంటే ప్రతిపక్షనేతగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సిల్లీ విషయాల్లో అడ్డంగా దొరికిపోతున్నారు. ముఖ్యంగా ఆయన సోషల్ మీడియాలో చేసే ట్వీట్లే ఆయన్ను ఇరకాటంలోకి నెడుతున్నాయి. తాజాగా ఆశా వర్కర్లకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు చంద్రబాబు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే ఇప్పుడు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంతకీ ఏంటా ట్వీట్.. ?

సెల్ఫ్ గోల్ వేసుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఆయనే సీనియర్ మోస్ట్ అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు మీడియా ముందు మాట్లాడుతున్న సమయంలో కూడా నోరు జారి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ జగన్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. మొన్న జూనియర్ డాక్టర్ల నిరసన కార్యక్రమంలో పోలీసులు ఓ డాక్టరుపై చేయిచేసుకున్న వీడియో పోస్టు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత కియా మోటర్స్ కార్లు విడుదల సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఓ ఆశావర్కర్లపై ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టి అడ్డంగా దొరికిపోయారు. మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.

ఆశావర్కర్లకు సంబంధించి రెండు ఫోటోలు పోస్టు చేసిన బాబు

ఆశావర్కర్లకు సంబంధించి రెండు ఫోటోలు పోస్టు చేసిన బాబు


ఇక అసలు విషయానికొస్తే చంద్రబాబు ఆశా వర్కర్లకు సంబంధించి రెండు ఫోటోలు పోస్టు చేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆశావర్కర్ల జీతంను రూ.10వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ ప్రకటనతో ఆశావర్కర్లు ఆయన ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఆ ఫోటోను చంద్రబాబు "అప్పుడు" అని పెడుతూ పోస్టు చేశారు. దానికిందనే మరో ఫోటోను పోస్టు చేశారు. అదే ఆశా వర్కర్లు ప్రభుత్వ దిష్టి బొమ్మను పాడె మోస్తూ ప్రధాన రహదారిపై తీసుకెళ్లే ఫోటోను పోస్టు చేశారు. దానిపై "ఇప్పుడు" అని రాశారు. "ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాట తప్పితే జరిగే సన్మానం ఇదే.. !!
ఇప్పటికైనా ఆశా వర్కర్లను ఆదుకోండి" అంటూ రాసుకొచ్చారు. మొదటి ఫోటో వరకు బాగానే ఉంది. కానీ రెండో ఫోటో వచ్చేసరికి అడ్డంగా బుక్కయ్యారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. రెండో ఫోటోకు అసలు కథ వేరుగా ఉంది.

రెండ్రోజుల క్రితమే ఆశావర్కర్లకు జీతం పెంచుతూ జీవో జారీ

రెండో ఫోటోలో కనిపిస్తున్న ఆశావర్కర్లు తమ నిరసన తెలిపిన మాట వాస్తవమే. అయితే అది ఇప్పుడు నిరసన తెలిపినది కాదు. పైగా తెలంగాణలో 2015లో ఆశావర్కర్లు తెలంగాణ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఫోటో అది. ఈ ఫోటోను ప్రముఖ జాతీయ పత్రిక "ది హిందూ " కవర్ చేసింది. నిరసనకు సంబంధించి వార్త కూడా రాసింది. ఈ ఫోటోనే పోస్ట్ చేసి చంద్రబాబు అడ్డంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. చంద్రబాబు ట్వీట్ చూసిన నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ ట్వీట్లు చేస్తున్నది మీరేనా... లేక మీకంటూ ఓ టీమ్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ట్వీట్లు చేయడం వల్ల 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఒక్కసారిగా తుస్సు మంటుంది చంద్రబాబు గారూ అంటూ నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు నాటి హిందూ పత్రిక క్యారీ చేసిన కథనంకు సంబంధించిన లింకును కూడా నెటిజెన్లు పోస్టు చేశారు. ఇక మరో విషయానికొస్తే రెండు రోజుల క్రితమే ఆశావర్కర్లకు రూ.10వేలు వేతనం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరి చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ నేత ఈ విషయాన్ని ఎలా మరిచి ఆ ట్వీట్ చేశారనేదానిపై మరికొందరు చర్చించుకుంటున్నారు. అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతోందో చంద్రబాబు అప్‌డేట్ అవడం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

చంద్రబాబు ఫోటోను పోస్టు చేస్తూ పప్పులో కాలేసిన వర్లరామయ్య

ఇక చంద్రబాబు ట్వీట్ చేసిన ఫోటోను పట్టుకుని టీడీపీ నేత వర్లరామయ్య కూడా అదే తప్పిదాన్ని చేశారు. "అయ్యా! పాడే మోసే మహిళలు హెల్త్ వర్కర్స్ లాగ వున్నారు. ఏమిటీ ఖర్మ వాళ్లకు?ఏదో మాట తప్పారట, అందుకని మీ ప్రభుత్వానికి పాడే కట్టినట్టున్నారు. మాట తప్పని, మడెం తిప్పని మీరు, చిరు ఉద్యోగుల కడుపు కొట్టకండి. న్యాయం జరిగేలా చూడండి. ఇదే రాజన్న రాజ్యం." అంటూ ఏపీ సీఎం జగన్‌ను తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. వర్ల రామయ్య చేసిన ట్వీట్ పై కొందరు వైసీపీ అభిమానులు స్పందించారు. విమర్శ చేసే ముందు ఆ ఫోటో ఎప్పటిదో చూసుకోవాలంటూ చెప్పారు. కనీసం ఏపీకి సంబంధించిన వారు కూడా ఆ ఆశ వర్కర్లు కాదని యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా మీ వ్యవహారం ఉందని సెటైర్లు వేశారు. ఏదో మీ బాస్ పోస్టు చేశారు కదా అని ఆయన మెప్పు పొందేందుకు మీరు కూడా పప్పులో కాలేస్తే ఎలాగండి వర్ల రామయ్యగారూ అంటూ నెటిజెన్లు సెటైర్లు వేశారు.


మొత్తానికి సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేసినప్పుడు అవి మిస్ ఫైర్ అవుతుండటంతో ఇరకాటంలోకి పడిపోతున్నారు. ఇందుకు తాజా ట్వీట్లే నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
AP opposition leader chandrababu naidu made a self goal by posting a wrong photo on twitter. Chandrababu who took over Jagan on the issue of AAsha health workers, said that the government had betrayed the health workers. Supporting this he posted a wrong photo that was posted in 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X