• search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ వేట మొదలైంది -ఆలయాల కేసుల్లో టార్గెట్ టీడీపీ -అదుపులో బుచ్చయ్య చౌదరి పీఏ -వరుస అరెస్టులు

|

ఒకటీ రెండూ కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కొద్దీ చిన్నా, పెద్ద, ప్రముఖ ఆలయాలపై దాడులు, అనూహ్య ఘటనలను చోటుచేసుకోవడం, వాటికి మీరంటూ మీరే బాధ్యులంటూ అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఆలయాల ఘటనల్లో కుట్ర కోణాలు లేవంటూనే.. వాటితో సంబంధమున్న కేసుల్లో టీడీపీ నేతలు, వారి అనుచరుల అరెస్టుల పర్వం మొదలైంది. ముందుగా..

షాక్: మోదీ మెడలు వంచిన రైతులు -సాగు చట్టాల వాయిదాకు కేంద్రం అంగీకారం -నో చెప్పిన సంఘాలుషాక్: మోదీ మెడలు వంచిన రైతులు -సాగు చట్టాల వాయిదాకు కేంద్రం అంగీకారం -నో చెప్పిన సంఘాలు

 హుకుంపేట వినాయక విగ్రహం..

హుకుంపేట వినాయక విగ్రహం..

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్‌ను పోలీసులు బుధవారం శ్రీశైలంలో అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలోని హుకుంపేటలో వినాయకుడి విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఘటనపై సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని సందీప్‌పై ఆరోపణలున్నాయి. అయితే..

శ్రైశైలానికి పరార్..

శ్రైశైలానికి పరార్..

హుకుంపేటలో వినాయకుడి విగ్రహానికి అపచారం ఘటనలో రాజమండ్రి పోలీసులు తొలుత టీడీపీ నేత బాబుఖాన్‌ చౌదరిని అరెస్టు చేశారు. కానీ, దీనికి అసలు కారకుడు బుచ్చయ్య చౌదరీ పీఏ సందీప్‌ అని భావించిన పోలీసులు అరెస్టుకు యత్నించగా.. సందీప్‌ పరారైపోయాడు. తాజాగా సందీప్‌.. కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు సందీప్‌కు రిమాండ్‌ విధించింది. కాగా, ఈ కేసులో మరికొందరిపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా..

 టీడీపీ బడా నేతలు కూడా..

టీడీపీ బడా నేతలు కూడా..

రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, విగ్రహాలపై జరుగుతున్న దాడులకు కారకులైన దోషులను పట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం.. అమాయకులను వేధిస్తోందని, గతేడాది సెప్టెంబరు 12న పిడింగొయ్యి వద్ద వినాయక విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఘటనపై తామే పోలీసులకు ఫిర్యాదు చేయగా, రివర్సులో తన పీఏ సందీప్ సహా ఇంకొదరిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. మరోవైపు, ఆలయాలపై దాడులతో సంబంధమున్న ఇతర అంశాలపైనా టీడీపీ బడా నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి చేసిన కేసుకు సంబంధించి టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

జగన్ శత్రువే, చంద్రబాబు మోసగాడు -టీడీపీతో కలిస్తే బీజేపీకి అధోగతే -తిరుపతిలో ప్లాన్ 47: దేవధర్ సంచలనంజగన్ శత్రువే, చంద్రబాబు మోసగాడు -టీడీపీతో కలిస్తే బీజేపీకి అధోగతే -తిరుపతిలో ప్లాన్ 47: దేవధర్ సంచలనం

English summary
Rajahmundry Rural MLA Gorantla Butchaiah Chowdary's PA Chitikela Sandeep was arrested by the police in Srisailam on Wednesday. Sandeep has been accused of inciting religious hatred on social media over the desecration of the Hukumpeta Vinayaka statue in Rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X