వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్టిస్‌ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదు- కోర్టు ధిక్కరణ మళ్లీ తిరస్కరణ- సుమోటో చర్యలేనన్న అటార్నీ

|
Google Oneindia TeluguNews

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ సీఎం జగన్‌ భారత ప్రధాన న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదుపై కోర్టు ధిక్కరణకు కేంద్రం మరోసారి అయిష్టత చూపింది. ఈ మేరకు లాయర్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌ కోర్టు ధిక్కరణ చర్యల కోసం కోరిన అనుమతిని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ మరోసారి తిరస్కరించారు. అంతే కాకుండా ఈ వ్యవహారంలో ఉన్న సంక్లిష్టతను సైతం సుదీర్ఘంగా ఆయనకు వివరించారు. ఈ వ్యవహారంలో ఏ చర్యలు చేపట్టాలన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే నిర్ణయం తీసుకోవాలని ఆయన మరోసారి తేల్చిచెప్పారు.

జగన్‌పై కోర్టు ధిక్కరణకు మళ్లీ చుక్కెదురు..

జగన్‌పై కోర్టు ధిక్కరణకు మళ్లీ చుక్కెదురు..


జస్టిస్‌ ఎన్వీ రమణపై ఏపీ సీఎం జగన్‌ చేసిన ఫిర్యాదు వ్యవహారంలో ఆయనపై సుప్రీంకోర్టు క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేలా పిటిషన్‌ వేస్తానని మొండిపట్టు పట్టిన లాయర్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌కు మరోసారి చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో ఉన్న సంక్లిష్టతను అర్ధం చేసుకోకుండా అటార్నీ జనరల్‌ను పదేపదే జగన్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు కోరుతున్న ఆయన్ను సుతిమెత్తగా హెచ్చరిస్తూ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌కు రాసిన లేఖను బయటపెట్టినందుకు జగన్‌తో పాటు ప్రధాన సలహాదారు అజేయకల్లంపై చర్యలు తీసుకోవడం తిరిగి ఆయన పరిధిలోనే ఉందని తన తాజా లేఖలో అటార్నీ జనరల్‌ కుండబద్దలు కొట్టారు. దీంతో ఎలాగైనా సరే ఈ వ్యవహారంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేయాలన్న లాయర్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌ కు నిరాశ తప్పడం లేదు.

ప్రజా ప్రయోజనం కూడా చూడాల్సిందే..

ప్రజా ప్రయోజనం కూడా చూడాల్సిందే..


సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌కు రాసిన లేఖను బయటపెట్టిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన ముఖ్య సలహాదారు అజేయకల్లంపై కోర్టు ధిక్కరణ చర్యల విషయంలో ప్రాధమిక సాక్ష్యాధారాలు చూడాలని, అదే సమయంలో కోర్టు ధిక్కరణ దాఖలులో ప్రజా ప్రయోజనం ఉందా లేదా అని చూడాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని అటార్నీ జనరల్‌ వేణుగోపాల్ చాలా స్పష్టంగా చెప్పారు. జగన్‌, అజేయ కల్లంపై కోర్టు ధిక్కరణ చర్యల ద్వారా ముందుకెళితే అంతిమంగా ప్రజాప్రయోజనం నెరవేరుతుందా అన్న విషయం కూడా చూడాలని అటార్నీ జనరల్‌ లాయర్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో కోర్టు ధిక్కరణ చర్యలు ప్రజా ప్రయోజనాల కోణంలో ఉన్నట్లు తాను సంతృప్తి చెందలేదని అటార్నీ జనరల్‌ పరోక్షంగా చెప్పినట్లయింది.

నా నిర్ణయం మారదన్న అటార్నీ...

నా నిర్ణయం మారదన్న అటార్నీ...

ప్రధాన న్యాయమూర్తికి జగన్‌ రాసిన లేఖలో ఎక్కడా ఇది రహస్యమని పేర్కొనలేదని, అలాగే ఇది తమ ప్రైవేటు లేఖ అని కూడా ఎక్కడా పేర్కొలేదని అటార్నీ జనరల్‌ తన సమాధానంలో తెలిపారు. అదే సమయంలో జగన్‌ రాసిన లేఖను బయటపెట్టిన సందర్భంగా సలహాదారు అజేయ కల్లం కూడా లేఖలో పేర్కొన్న విషయాలకు మించి ఏమీ మాట్లాడలేదని అటార్నీ గుర్తుచేశారు. కాబట్టి వారు నేరుగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌ జోక్యాన్ని కోరుతున్నారని, అంతకు మించి కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడినట్లు తనకు అనిపించడం లేదని అటార్నీ జనరల్‌ తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని ఏజీ వేణుగోపాల్‌ అభిప్రాయపడ్డారు.

జగన్‌ లేఖపై సుమోటో కోర్టు ధిక్కరణ..

జగన్‌ లేఖపై సుమోటో కోర్టు ధిక్కరణ..

ప్రధాన న్యాయమూర్తికి జగన్‌ రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై మాత్రమే కోర్టు ధిక్కరణకు అవకాశం ఉందని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలిపారు. కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం జగన్‌ నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలువురు న్యాయమూర్తులపై రాసిన లేఖలో అంశాలపై సుమోటో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని, ఇది కూడా ఛీఫ్‌ జస్టిస్‌ పరిధిలోనే ఉందని అటార్నీ జనరల్‌ వెల్లడించారు. ఒకసారి ఛీఫ్‌ జస్టిస్ పరిధిలోకి వెళ్లిపోయిన వ్యవహారంపై తాను నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదనే విషయాన్ని ఏజీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. ఇప్పుడీ వ్యవహారం ఫిర్యాదు దారు అయిన జగన్‌కూ, ఫిర్యాదు స్వీకరించిన ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు మధ్యలో ఉందని, ఇందులో మూడో వ్యక్తి దూరి కోర్టు ధిక్కరణ చర్యలు కోరే అవకాశం లేదన్నారు.

 జగన్‌ లేఖపై చర్యలకు ప్రత్యామ్నాయాలివే...

జగన్‌ లేఖపై చర్యలకు ప్రత్యామ్నాయాలివే...

జగన్‌ లేఖపై కోర్టు ధిక్కరణకు బదులు ఇతరత్రా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు లాయర్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌కు ఉన్న అవకాశాలను సైతం అటార్నీ జనరల్‌ తన సమాధానంలో ప్రస్తావించారు. వీటి ప్రకారం పాలనా పరమైన కోణంలో చర్యలు కోరవచ్చని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి సుమోటో చర్యలు కోరవచ్చని, అలాగే ఇవే ఫిర్యాదులతో దాఖలైన మరో పిటిషన్‌లో భాగస్వామిగా ఉన్నందున అందులోనూ తన వాదనలు వినిపించవచ్చని అశ్విని ఉపాధ్యాయ్‌కు అటార్నీ జనరల్‌ సూచించారు. ఇందులో ఏదో ఒక మార్గం ఎంచుకోవాలని ఆయనకు సూచించారు. తాను మాత్రం జగన్‌పై కోర్టు ధిక్కరణ చర్యలపై పిటిషన్‌ దాఖలుకగు అనుమతి తిరస్కరిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ రాసిన లేఖపై స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోలేనని అటార్నీ తేల్చిచెప్పారు.

English summary
attorney general kk venugopal has rejected supreme court contempt proceedings against andhra pradesh chief minister ys jagan mohan reddy once again in alleged complaint to chief justice of india aginst justice nv ramana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X