• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు షాక్... తిరగబడ్డ కార్పోరేటర్ అభ్యర్థి.. కడుపు మండింది,ఇక ఫోన్లు చేయొద్దు...

|

మున్సిపల్,కార్పోరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ముందు దారుణంగా చతికిలపడ్డ టీడీపీలో కింది స్థాయి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం కొరవడుతోంది. పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసినా పైస్థాయిలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఎన్నికల్లో తమ కొంపముంచాయని ఇటీవల మున్సిపల్,కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన కొంతమంది అభ్యర్థులు భావిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్‌లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయినవారిలో పార్టీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా లీకైన ఓ ఆడియో సంభాషణతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

జగన్ సరికొత్త రికార్డు -సగానికిపైగా ఓట్లు వైసీపీకే -భారీగా తగ్గిన టీడీపీ షేర్ -మున్సిపోల్స్ ఓటింగ్ శాతం ఇలాజగన్ సరికొత్త రికార్డు -సగానికిపైగా ఓట్లు వైసీపీకే -భారీగా తగ్గిన టీడీపీ షేర్ -మున్సిపోల్స్ ఓటింగ్ శాతం ఇలా

ఫేస్‌బుక్‌లో పోస్టుతో వివాదం...

ఫేస్‌బుక్‌లో పోస్టుతో వివాదం...

విజయవాడ 42 వ డివిజన్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన టీడీపీ కార్పోరేటర్‌ అభ్యర్ధి యెదుపాటి రామయ్య తన ఓటమిపై ఫేస్‌బుక్‌ పోస్టులో పలు వ్యాఖ్యలు చేశారు. ఒక్క ప్రెస్‌మీట్‌తో 20 మంది కార్పోరేట్‌ అభ్యర్ధులం ఓడిపోయాం. మన ఓటమికి కారణం ఎవరో మనందరికి తెలుసు.. అని అందులో పేర్కొన్నారు. రామయ్య పోస్టుతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీలో కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న యెదుపాటి రామయ్యకు ఫోన్ చేసి ఆ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టావని ప్రశ్నించారు.

బుద్దా వెంకన్న-యెదుపాటి రామయ్య ఆడియో వైరల్...

బుద్దా వెంకన్న-యెదుపాటి రామయ్య ఆడియో వైరల్...

బుద్దా వెంకన్న : ఏంటి ఏదో మెసేజ్ పెట్టావంటా...

రామయ్య : అవును... నాకు కడుపు మండిద్ది పెట్టాను..
బుద్దా వెంకన్న : ఎవరి మీద పెట్టావ్...
రామయ్య : నేను ఎవరిపై పెట్టానో వాళ్లకు అర్థమైంది... ఎవరికి అర్థమైతే వాళ్ల మీద పెట్టినట్లు... మీకు ఇష్టముంటే పార్టీలో ఉంచుకోండి లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి.

ఊరే విడిచి వెళ్లిపోతాం సార్ : రామయ్య సతీమణి

ఊరే విడిచి వెళ్లిపోతాం సార్ : రామయ్య సతీమణి

యెదుపాటి రామయ్య బుద్దా వెంకన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మధ్యలో ఆయన సతీమణి ఫోన్ తీసుకున్నారు. 'హలో సార్... రామయ్య ఎలాంటోడు మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడ రామయ్య ఓడిపోవడమంటే అంతా ఆశ్చర్యపోతున్నారు. మాకు చాలా బాధగా ఉంది. మేము పార్టీ నుంచి వెళ్లిపోతాం సార్... ఊరే వదిలిపోతాం. పార్టీని నమ్ముకుని రూపాయి సంపాదించింది లేదు. పిల్లలను రోడ్డుపైకి తీసుకొచ్చుకున్నాం. వ్యాపారం లేదు. ఏడేళ్లు ఆయన పార్టీ వెంట తిరిగారు. ఇక వైజాగ్ వెళ్లిపోతాం. నాయకులు మీరు మీరు కొట్టుకుని బాగానే ఉంటారు. కాస్త కార్యకర్తల గురించి ఆలోచించండి సార్... నష్టపోయేది మేము. వైసీపీ తరుపున మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు. మీరెవరైనా కష్టపడ్డారా... ఇక మా ఫోన్లు చేయొద్దు.' అంటూ ఆమె ముగించారు.

నాయకుల మధ్య విభేదాలు కొంపముంచాయని...

నాయకుల మధ్య విభేదాలు కొంపముంచాయని...

ఇదే విషయమై మరో స్థానిక టీడీపీ నేత యెదుపాటి రామయ్యకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. నాకు దమ్ముంది ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాను... వానికి దమ్ముంటే వాన్ని కూడా పెట్టమను అంటూ రామయ్య సవాల్ విసిరారు. గొడవ నీకు,నాకు మధ్య కాదని... వాడినెవడినో తిడితే నీకెందుకు కోపమని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ రెండు ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వేళ విజయవాడ టీడీపీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. కేశినానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన బుద్దా వెంకన్న... ఆయన్ను చెప్పుతో కొడుతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విభేదాలే టీడీపీ అభ్యర్థుల కొంపముంచాయని ఓటమిపాలైన అభ్యర్థులు భావిస్తున్నారు.

English summary
TDP corporator candidate Yedupati Ramaiah, who contested from Vijayawada 42nd Division and lost, made several comments on his defeat in a Facebook post. With one press meet, 20 corporate candidates lost,we all know the reason for our defeat .. he mentioned in it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X