వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలలో వైసీపీ టిడిపికి పోటీయే కాదు: ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెలు

నంద్యాలలో టిడిపికి వైసీపీ అభ్యర్థి శిల్పా పోటీయే కాదని ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెలు చెప్పారు.బ్రహ్మనందరెడ్డికి మద్దతుగా ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెలు ప్రచారం నిర్వహించారు.భూమానాగిరెడ్డి ఆశయాల కోసం పనిచ

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: కర్నూలు జిల్లా: నంద్యాలలో టీడీపీకి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అసలు పోటీయే కాదని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెలు అన్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 50 వేల మెజారిటీ వస్తుందని అన్నారు.

టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి గెలుపు కోసం భూమా బ్రహ్మనందరెడ్డి అనుచరుడిగా పేరున్న ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెలు జాహ్నావి, జశ్వంతి, కరిష్మా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

AV Subbba Reddy daughters campaigned to Bhuma Brahmandha reddy

భూమా నాగిరెడ్డితో ఏవీ సుబ్బారెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. భూమా పిల్లలు, ఏవీ సుబ్బారెడ్డి పిల్లలు కలిసి చదువుకొన్నారు.భూమా నాగిరెడ్డి చనిపోయిన సమయంలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా బాధపడ్డారు.

భూమా బ్రహ్మనందరెడ్డికి మద్దతుగా ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెలు తొలిసారిగా ప్రచారంలో పాల్గొన్నారు. నాన్నకు కాలు సరిగా లేకున్నా ప్రచారంలో నెలరోజులుగా విశ్రాంతి తీసుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్న విషయాన్ని వారు గుర్తుచేశారు.

నాన్నపై వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదని వారు చెప్పారు. నాన్న ఎలాంటి వారో చంద్రబాబుకు, లోకేష్‌కు తెలుసునని చెప్పారు. భూమా నాగిరెడ్డి ఆశయాల సాధన కోసం నాన్నతో పాటు తాము కూడ ప్రచారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఈ ఎన్నికల్లో టిడిపికి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పోటీయే కాదన్నారు.నాన్న ఎలాంటి పదవులను ఆశించడం లేదని చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తున్నారని వారు చెప్పారు.

English summary
Tdp leader AV Subba Reddy daughters campined for Tdp candidate Bhuma Brahmandha reddy . Bhuma Brahmandha reddy will win in by poll they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X