విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంటా ల‌క్ష్యం ముఖ్య‌మంత్రి కుర్చీ : నా జోలికి రావ‌ద్దు : గ‌ంటా పై అవంతి సంచ‌ల‌నం..!

|
Google Oneindia TeluguNews

నాటి స్నేహితుడు..రాజ‌కీయ మిత్రుడు గంటా శ్రీనివాస రావు పై తాజాగా వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు.గంటా లక్ష్యం ముఖ్య‌మంత్రి సీటు అని వ్యాఖ్యానించారు. మంత్రి గంటా పై స‌హ‌చ‌ర మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు చెబుతార‌ని..గంటా పై సిగ్ కేసు వేసారంటే ఆయ‌న ప‌రిస్థితి అర్దం చేసుకోవాల‌న్నారు.

చంద్ర‌బాబు విలువల గురించా..

చంద్ర‌బాబు విలువల గురించా..

టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను కృతజ్ఞతలు చెప్పుకోవాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని అన్నారు. ఇక నుం చి వైఎస్సార్ సీపీ గెలుపుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. విలువల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నమ్మించి మోసం చేయడం ఆయనకు అలవాటేనని, స్వార్థ రాజకీయాల కో సం తాను పార్టీ మారలేదని అన్నారు. చంద్రబాబును ఎన్నడూ ఎంపీ సీటు అడగలేదని అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చే శారు. తాను భీమిలీ అసెంబ్లీ సీటు అడిగితే ఎంపీగా ఎందుకు పంపించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మోసం లో గంటాకు బాబు ఆద‌ర్శం..

మోసం లో గంటాకు బాబు ఆద‌ర్శం..

చంద్రబాబు తనకు రోల్‌ మోడల్ అని చెప్పుకునే మంత్రి గంటా శ్రీనివాసరావు మాటలు వాస్తవమేనని అవంతి శ్రీనివా స్‌ అంగీకరించారు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబే మంత్రి గంటాకు ఆదర్శమన్నారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చని అనుకుంటే పొరపాటేనని, గంటా గురించి తెలియాలంటే మంత్రి అయ్యన్నపాత్రుడిని అడిగితే సరిపో తుందన్నారు. జిల్లా మంత్రిగా ఉన్న ఆయన ఒక్కరోజు కూడా సమన్వయకమిటీ సమావేశాలకు హాజరు కాలేదని, అ లాంటిది తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తనపై పోటీ చేసే వ్యక్తి కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తనదని ఆయన... దయచేసి మంత్రి గంటా తన జోలికి రావద్దొని ఇక నుంచి మీ పని మీరు చేసుకోండి...నా పని నేను చేసుకుంటాను అని అవంతి శ్రీనివాస్‌ హితవు పలికారు.

గంటా లక్ష్యం సీయం సీటు..

గంటా లక్ష్యం సీయం సీటు..

గంటా పై అవంతి తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. తాను టిడిపిలో అధికార ప్ర‌తినిధిగా ఉన్నాన‌ని.. టీడీపీ అధికార ప్రతినిధి అంటే ప్రతిపక్ష పార్టీని తిట్టడమే పని అని ఆయన అన్నారు. గంటా శ్రీనివాసరావు లక్ష్యం భీమిలి అసెంబ్లీ సీటు కాదని, ఏకంగా అమరావతిలో ముఖ్యమంత్రి కుర్చీ అని వ్యాఖ్యానించారు. గంటాను నమ్మి టీడీపీలోకి వెళ్లినవారిలో చింతలపూడి వెంకటరామయ్య, కన్నబాబుకు టికెట్‌ లేకుండా చేశారని గుర్తు చేశారు. భీమిలి నియోజకవర్గ ప్రజలను మంత్రి గంటా హీనంగా చూస్తారన్నారు. తానంతట తాను టీడీపీలోకి వెళ్లిలేదని, వాళ్లు పిలిస్తేనే వెళ్లానన‍్న అవంతి శ్రీనివాస్‌ ...తనకు రెండు లక్షలమంది విద్యార్థుల శక్తి ఉందని అవంతి శ్రీనివాస్ వివ‌రించారు. త‌న జోలికి వ‌స్తే తాను చాలా విష‌యాలు బ‌య‌ట పెట్టాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

English summary
EX MP Avanthi Srinivasa rao lashes out Chandra babu and Ganta Srinivasa rao in Vizag. After he joins in YCp first he visit visakha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X