వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా .. టీడీపీ నేతలకు అవంతి శ్రీనివాస్ సవాల్

|
Google Oneindia TeluguNews

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు ఉన్నారు. ఇక ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్రంలో జగన్ ఏడాది పాలన గురించి మాట్లాడిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ టిడిపి నేతలకు సవాల్ విసిరారు. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని మండిపడ్డారు. నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

లోకేష్ బరువు తగ్గటానికి రీజన్ చెప్పిన రోజా.. టీడీపీని జూమ్ చేసి చూడాలంటూ సెటైర్లులోకేష్ బరువు తగ్గటానికి రీజన్ చెప్పిన రోజా.. టీడీపీని జూమ్ చేసి చూడాలంటూ సెటైర్లు

 చంద్రబాబు అప్పుల ఊబిలో నెట్టారు .. జగన్ సంక్షేమ పాలన చేశారు

చంద్రబాబు అప్పుల ఊబిలో నెట్టారు .. జగన్ సంక్షేమ పాలన చేశారు

ఇక అసలు విషయానికి వస్తే విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సీఎంగా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి మాట్లాడిన అవంతి శ్రీనివాస్ ఏడాది పాలనలో వైయస్ జగన్ చరిత్ర సృష్టించారని, ఇచ్చిన హామీలను 90% నెరవేర్చారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టినా సీఎం జగన్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. కరోనా వైరస్ కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను విస్మరించకుండా ప్రజలకు అందించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు.

భూ కబ్జా జరిగిందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న అవంతి

భూ కబ్జా జరిగిందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న అవంతి

కుట్రలు కుతంత్రాలు చేసి రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని, లోకేష్ ను విమర్శించారు. విశాఖ భూముల కోసమే విశాఖను రాజధానిగా ప్రకటించారని టీడీపీ ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు. విశాఖ భూ కబ్జా పై టీడీపీ నేతల ఆరోపణలను అవంతి శ్రీనివాస్ ఖండించారు. ఇక వైసిపి ఏడాది పాలనలో భూ కబ్జా జరిగిందని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అవంతి శ్రీనివాస్ టిడిపి నేతలకు సవాల్ విసిరారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల ప్రకటన

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల ప్రకటన

టిడిపి నేతలు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసిన సీఎం జగన్ తన పాలనతో వాటిని ధీటుగా ఎదుర్కొంటున్నారని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా 80 శాతానికి పైగా సీట్లను, 50 శాతం ఓట్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటన చేశారని అన్నారు. పాడేరు లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు నిధులు కూడా కేటాయించారని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సీఎం జగన్ సముచితస్థానం ఇస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

English summary
Avanti Srinivas said that no matter how many TDP leaders criticized, in so many conspiracies CM Jagan faced with his regime. Avanti Srinivas has denied the TDP leaders' allegations against Vishakha land grabbing scam . Avanti Srinivas has challenged the TDP leaders he will resign as minister if they proves that the land grab has taken place during the YCP administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X