వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవంతి వర్సెస్ గంటా... విశాఖలో వీరి రాజకీయ మంట .. అసలు రీజన్ ఇదేనా ?

|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగినా గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ రావు ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. ఒకరి బండారం ఒకరు బయట పెడతామంటూ మాటల యుద్ధానికి దిగారు. విశాఖ తీరాన ప్రశాంతతను భగ్నం చేస్తూ వీరిద్దరి మధ్య నడుస్తున్న మాటల దాడి పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. వీరి మధ్య నడుస్తున్న మాటల యుద్ధం రాజకీయాలు ఎలాంటి వారినైనా, ఎలాగైనా మార్చగలవు అన్న భావనను కలిగిస్తున్నాయి.

చంద్రయాన్ -2 తో రిపోర్టర్ గా ....కేరళ రాష్ట్ర మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జర్నలిస్ట్ సాదియాచంద్రయాన్ -2 తో రిపోర్టర్ గా ....కేరళ రాష్ట్ర మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జర్నలిస్ట్ సాదియా

అసలు అవంతిని మంత్రిగా గుర్తించనన్న గంటా .. గంటా మనిషిగానే చూడనన్న అవంతి

అసలు అవంతిని మంత్రిగా గుర్తించనన్న గంటా .. గంటా మనిషిగానే చూడనన్న అవంతి

అవంతి వ్యాఖ్యలకు రిటార్ట్ అన్నట్లుగా గంటా కూడా గట్టిగానే మాట్లాడారు.అసలు ఆయన్ని తాను మంత్రిగా గుర్తించను అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావును తాను మంత్రిగా చూడడం లేదని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానిస్తే అసలు గంటా శ్రీనివాసరావు తన మనిషిగానే చూడడం లేదని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇంకా గంటా శ్రీనివాసరావు మంత్రి అన్న భ్రమలోనే ఉన్నారని మండిపడిన అవంతి, తన జోలికి వస్తే విశాఖలోనే ఉండకుండా చేస్తానని వ్యాఖ్యానించారు. ఇక గంటా బాగోతం అంతా బయట పెడతానన్న అవంతి నెల్లూరు మెస్ లో టికెట్లు అమ్ముకున్న బాగోతం తమకు తెలుసంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ఇక అంతే కాదు పార్టీలు మారడం బాగా అలవాటైన గంటా తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడుని అణగదొక్కారని, కానీ తాను అయ్యన్నపాత్రుడు అంత మంచోడిని కాదని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.

గంటా శ్రీనివాసరావుకు అవంతి శ్రీనివాసరావు మీద కోపానికి కారణం ఇదే

గంటా శ్రీనివాసరావుకు అవంతి శ్రీనివాసరావు మీద కోపానికి కారణం ఇదే

అసలు గంటా శ్రీనివాసరావు అవంతి మీద కోపంగా ఉండటం వెనుక అసలు కారణం ఏంటంటే గంటా శ్రీనివాసరావు గత ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీ లోకి రావాలని చాలా ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా గంటా స్థానంలో అవంతి శ్రీనివాస్ వైసిపి లో చేరి ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఆయన జగన్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఇక గంట విషయానికొస్తే ప్రజారాజ్యం పార్టీ నుండి విజయం సాధించిన గంటా, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన టిడిపి నుండి కూడా మంత్రిగా పని చేశారు. ఇక వైసీపీ లో చేరి ఆయన పార్టీ మారితే మంత్రి అయ్యేవారే. కానీ అవంతి శ్రీనివాసరావు ఆ ప్లేస్ లోకి రావడం వల్ల గంటా ప్లాన్ మారిపోయి ఇప్పుడు ఏ పదవి లేకుండా టీడీపీలో కొనసాగుతున్నారు.

ఇద్దరు మిత్రుల మధ్య సాగుతున్న మాటల యుద్ధం .. విశాఖలో హాట్ టాపిక్

ఇద్దరు మిత్రుల మధ్య సాగుతున్న మాటల యుద్ధం .. విశాఖలో హాట్ టాపిక్

ఇదే సమయంలో గంటాను ఉద్దేశించి అవంతి వ్యాఖ్యలు చెయ్యటం దానికి గంటా కౌంటర్ ఇవ్వటంతో భగ్గుమన్న అవంతి గంటా శ్రీనివాసరావుపై ఘాటైన విమర్శలు చేశారు . ఒకప్పుడు టీడీపీలో ఇద్దరు మిత్రులు ఒక మంచి అవగాహనతో కలసి మెలసి పార్టీ కోసం పని చేశారు. ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. మొత్తానికి విశాఖ రాజకీయాల్లో ఇద్దరు మిత్రుల మధ్య సాగుతున్న మా టల యుధ్ధం ముందు ముందు ఎన్ని మలుపులు తీసుకుంటుందో, ఒకరి గురించి ఇంకొకరు ఏం చెప్తారో అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

English summary
Ganta Srinivasa Rao and Avanti srinivas made serious criticism on each other. Once in TDP, two friends ganta and avanti both worked together with better understanding for the Party. Now they are fighting each other. Overall, the war between the two friends in Vishakha politics has become a hot topic in the political circles of how many turns it takes before the end of the war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X