వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవితా వజ్రాయుధుడు ఇక లేరు: ఆ పుస్తకం పట్టుకుంటే అప్పుడు అరెస్ట్‌లే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ కవి డాక్టర్ అవంత్స సోమసుందర్ కన్నుమూశారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన స్వస్థలం పిఠాపురం. వజ్రాయధం పుస్తంతో ఆయన భావ కవిత ముద్ర వేశారు. అయితే విప్లవ ధోరణి ఉందంటూ అప్పట్లో ఆ పుస్తకంపై నిషేధంతో పాటు వెంట పుస్తకం ఉందని ఆప్పట్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మేఘరంజని, అక్షయ తరంగిణి, రక్తాక్షి, కాహళి పుస్తకాలను అవంత్స రాశారు.

Avantsa Somasundar passes away

కాగా, సాహితీవేత్త ఆవంత్స సోమ‌సుంద‌ర్ మృతికి తెలంగాణ సాహితి తరఫున ఘ‌న నివాళి అర్పించారు. తెలంగాణ సాహితి కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ ఆయన మృతికి సంతాపం తెలిపింది.

'తెలంగాణ సాయుధ పోరాటాన్ని మనకి వజ్రాయుధం పేర అందించిన మహాకవి. ఆయ‌న కాకినాడ‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుత మ‌ర‌ణించారు. పిఠాపురంలో నివాస‌ముంటున్న ఆయ‌న శంఖ‌వ‌రంలో జ‌న్మించారు. స్వ‌తంత్ర్య పోరాటంలో ప‌నిచేశారు. ఉమ్మ‌డి క‌మ్యూనిస్టు ఉద్య‌మంలో భాగ‌స్వామి అయ్యారు. ఆవంత్స మృతి అభ్యుద‌య సాహిత్యానికి, ప్ర‌గ‌తిశీల భావాల‌కు, సాహితీలోకానికి పెద్ద లోటు. ఆయ‌న కుటుంబ స‌భ్యులకు ప్ర‌గాఢ సానుభూతి' అని పేర్కొన్నారు.

English summary
Wellknown poet Avantsa Somasundar passes away on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X