విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయేషా హత్య కేసు: ఎనిమిదేళ్ల తరువాత అమ్మ చేతి స్పర్శను అనుభవిస్తున్నా: సత్యంబాబు

‘‘ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ అమ్మ చేతి స్పర్శను అనుభవిస్తున్నా.. నా జీవితంలో ఇది సంతోషకరమైన ఘట్టం..’’

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: ''ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ అమ్మ చేతి స్పర్శను అనుభవిస్తున్నా.. నా జీవితంలో ఇది సంతోషకరమైన ఘట్టం..''- ఆయేషా హత్య కేసులో ఎనిమిదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవల హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలైన పిడతల సత్యంబాబు తన తల్లి చేయి పట్టుకుని అన్నమాటలివి.

ఆదివారం ఉదయం 10.15 గంటలకు రాజమండ్రి కేంద్ర కారాగారం గేటులోంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న సత్యంబాబు గేటు బయట తన కోసం నిరీక్షిస్తున్న వారిలో తల్లి మరియమ్మను చూడతానే ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాడు.

మళ్లీ అమ్మ చేతి స్పర్శ...

మళ్లీ అమ్మ చేతి స్పర్శ...

కళ్లనిండా సంతోషం, దు:ఖంతో తల్లీకొడుకులిద్దరూ ఒకరి చేతుల్లో మరొకరు చేతులు ఉంచుకుని కొంతసేపు అలాగే ఉండిపోయారు. అనంతరం సత్యంబాబు తల్లి మరియమ్మ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు విడుదలవడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. చివరికి న్యాయమే గెలిచింది. మేం గెలిచాం..'' అంటూ ఆనంద భాష్పాలు రాల్చింది.

చేయని తప్పుకు ఎనిమిదేళ్లపాటు...

చేయని తప్పుకు ఎనిమిదేళ్లపాటు...

తన స్వగ్రామమైన అనాసాగరానికి బయలుదేరేముందు సత్యంబాబు విజయవాడలో విలేకరులతో మాట్లాడాడు. చేయని నేరానికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించానన్నాడు. తన జీవితంలో గతించిన ఈ ఎనిమిదేళ్లను ఎవరూ తనకు తెచ్చివ్వలేరని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇన్నేళ్లూ జైలులో ఎంతో బాధ, మనోవేదనను అనుభవించినట్లు చెప్పాడు.

మొదటి నుంచీ మొత్తుకుంటున్నా...

మొదటి నుంచీ మొత్తుకుంటున్నా...

అసలు నేరం చేయని కాడికి ఎందుకు శిక్షను అనుభవించాల్సి వచ్చింది? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తన విషయంలో పోలీసులు ఏం చేశారో లోకమంతటికీ తెలిసిన విషయమేనన్నాడు. ఆయేషాను తాను చంపలేదని తాను మొదటినుంచి మొత్తుకున్నానని, అయినా తన గోడును ఎవరూ వినిపించుకోలేదని తెలిపాడు.

ప్రభుత్వమే సహాయం చేయాలి...

ప్రభుత్వమే సహాయం చేయాలి...

తనకు జరిగిన అన్యాయానికి తాను పరిహారం కోరడం లేదని, ప్రభుత్వం దయతలచి తనకు సహాయం చేయాలని కోరాడు. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి తనకిప్పుడు ఉద్యోగం అవసరమని చెప్పాడు. అలాగే ఆయేషా మీరా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు.

వారి రుణం తీర్చుకోలేనిది...

వారి రుణం తీర్చుకోలేనిది...

ముఖ్యంగా ఆయేషా తల్లి, తన తరపున వాదించిన లాయర్లు, నాకోసం ఉద్యమించిన తమ గ్రామస్థులు అందరూ తనకెంతో మద్దతుగా నిలిచారని, దివంగత న్యాయవాది బొజ్జా తారకం వంటి వారెందరో తనకు అండగా నిలిచి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేశారని, వారందరికీ కూడా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పాడు. ఇక అనాసాగరం గ్రామస్థులయితే ప్రతి ఇంటికి రూ.200 చొప్పున చందాలు వేసుకుని ఆ డబ్బును తన కోసమే ఖర్చు చేసి, చివరికి తాను విడుదల కావడానికి సహకరించారని, వారి రుణం తీర్చుకోలేనిదంటూ గద్గద స్వరంతో చెప్పాడు.

కుటుంబానికి అండగా...

కుటుంబానికి అండగా...

ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయిందని, తాను గతాన్ని గుర్తు చేసుకోదలచుకోలేదని సత్యంబాబు వ్యాఖ్యానించాడు. తాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకాం పూర్తి చేశానని, తాను జైలుకు వెళ్లిన తరువాత తన తల్లి దయనీయ జీవితం గడిపిందని, ఇక ఇప్పుడు తాను తన కుటుంబానికి అండగా నిలవాలని అనుకుంటున్నానని చెప్పాడు.
తన తల్లి అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాంటిది ఏ తప్పూ చేయకుండానే తాను తన తల్లికి ఎనిమిదేళ్లపాటు దూరమైపోయానని, తన తల్లి చేతి స్పర్శను ఎనిమిదేళ్ల తరువాత తిరిగి అనుభవిస్తున్నానని, ఇప్పుడు తనకెంతో సంతోషంగా ఉందని సంత్యంబాబు పేర్కొన్నాడు.

English summary
Rajahmundry/Vijayawada: Touching my mother’s hand after eight years was my happiest moment, said Mr Pidatala Satyam Babu, who was released from the Rajahmundry Central Prison following his acquittal in the Ayesha Meera murder case. Mr Satyam Babu stepped out of the prison at 10.15 am to an emotional reunion with his mother Mariyamma. Both held hands for some time. Ms Mariyamma told mediapersons at the jail, “I am happy as my son is free. I have won the battle.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X