బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బినామీల పేరుతో మంత్రి జయరాం భూ దందా .. అధారాలున్నాయ్ : అయ్యన్న ఫైర్

|
Google Oneindia TeluguNews

టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీ మంత్రి జయరాంని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మంత్రి జయరాం బినామీల పేరుతో భూదందా చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేటు సంస్థకు చెందిన భూములను, తప్పుడు పత్రాలతో తన బంధువులు, బినామీల పేరిట మంత్రి జయరాం రాయించుకున్నారు అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి జయరాం భూదందా గురించి విషయాలను వెల్లడించారు.

మంత్రివేనా.. ఒళ్ళు బరువెక్కిందా .. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహంమంత్రివేనా.. ఒళ్ళు బరువెక్కిందా .. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహం

ఓ ప్రైవేట్ కంపెనీ భూమిని బినామీల పేరుతో ...

ఓ ప్రైవేట్ కంపెనీ భూమిని బినామీల పేరుతో ...

ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన భూమిని మంత్రి జయరాం ఒకేసారి నాలుగు వందల ఎకరాలు తీసుకోవడానికి ప్లాన్ చేశారని అయితే ల్యాండ్ సీలింగ్ చట్టం ఉండటంతో 204 ఎకరాలను మొదటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని తెలిపారు .ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి రాకుండా భూమిని విడదీశారు అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అంతేకాదు బినామీలు ,బంధువుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న జయరాం కర్నూలులోని కో-ఆపరేటివ్ బ్యాంక్ లో రుణాల కోసం అప్లై చేశారని కూడా అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

మంత్రిపై బెంగళూరులో కేసు నమోదు .. మంత్రి భూదందా కేసు కోర్టులో

మంత్రిపై బెంగళూరులో కేసు నమోదు .. మంత్రి భూదందా కేసు కోర్టులో

అయితే సదరు ప్రైవేటు సంస్థ యాజమాన్యం ఈ విషయాన్ని గుర్తించి వారు బెంగళూరులో ఉన్నందున అక్కడ పోలీస్ స్టేషన్ లో మంత్రి తన భూమిని ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారని, దీంతో పోలీసులు కేసు ఫైల్ చేశారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. సదరు ప్రైవేట్ సంస్థ నుండి బయటకు వచ్చిన మంజునాథ్ అనే వ్యక్తి తప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు సమర్పించి వందల ఎకరాల భూమిని తన పేరుమీద ఆ తర్వాత మంత్రి బంధువులకు విక్రయించారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంత్రి భూదందా కేసు కోర్టులో ఉందన్నారు .

మంత్రి జయరాం భూములు లాక్కున్నట్టు తన వద్ద ఆధారాలున్నాయన్న అయ్యన్న పాత్రుడు

మంత్రి జయరాం భూములు లాక్కున్నట్టు తన వద్ద ఆధారాలున్నాయన్న అయ్యన్న పాత్రుడు

అసలు కంపెనీతో మంజునాథ్ కి సంబంధం లేనప్పుడు, అతనికి అమ్మే హక్కు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. మంత్రి జయరాం కు ఇదంతా తెలిసినా బలవంతంగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో మంత్రి జయరాం తనకు భూములు లేవని పేర్కొన్నట్లుగా అయ్యన్నపాత్రుడు తెలిపారు.
మంత్రిని టార్గెట్ చేసి అయ్యన్న పాత్రుడు ఈ మొత్తం వ్యవహారంపై కోర్టులో కేసు ఉందని చెప్పారు. ప్రైవేట్ కంపెనీ నుండి జయరాం భూములు లాక్కున్నట్టు తన దగ్గర ఆధారాలున్నాయని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు .

English summary
A senior TDP leader and former minister Ayyanna paathrudu has been criticized AP minister Jayaram. Ayyannapathrudu alleged that Minister Jayaram was doing land grabbing in the name of Binami, alleging that Minister Jayaram had written off lands belonging to a private company in Kurnool district in the name of his relatives and Binami with false documents. There is also evidence to that effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X