వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రోజా అంటే దరిద్రం! నాశనమే! ఇక జగన్ ట్రూప్‌లో రికార్డింగ్ డ్యాన్సులే’

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రోజా అంటేనే ఓ దరిద్రం...ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ నాశనమే' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రోజా అంటేనే ఓ దరిద్రం...ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ నాశనమే' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మీడియాతో మాట్లాడారు.

మహిళలే తలదించుకుంటారు..

మహిళలే తలదించుకుంటారు..

రోజా మాటలకు మహిళలే తలదించుకుంటున్నారని, జబర్దస్త్‌లో డాన్సులు చేసే రోజాకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని అయ్యన్నపాత్రుడు ఘాటైన విమర్శ చేశారు.

రికార్డింగ్ డ్యాన్సులే..

రికార్డింగ్ డ్యాన్సులే..

త్వరలోనే జగన్ జెండా పీకేసి డ్రామా ట్రూప్ పెట్టడం ఖయమని.. రోజా ఆ డ్రామా ట్రూప్‌లో రికార్డింగ్ డాన్సులు చేయడం తథ్యమని ఆయ్యన్న వ్యాఖ్యానించారు.
నంద్యాల గెలుపుతో పక్క పార్టీల నేతలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు.

జగన్! ఇప్పటికైనా మారాలి..

జగన్! ఇప్పటికైనా మారాలి..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. కాకినాడ మేయర్‌ పీఠాన్ని 30 ఏళ్ల తర్వాత టీడీపీ కైవసం చేసుకోవడం హర్షనీయమన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడకుండా ప్రతిపక్ష నేతగా నిర్మాణాత్మక సూచనలు చేస్తే మంచిదని సూచించారు.

తగిన బుద్ధి చెప్పారు..

తగిన బుద్ధి చెప్పారు..

నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. చెప్పినట్లుగానే కాకినాడ ప్రజలు ఆశ్చర్యపోయేలా ఆ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి జగన్‌ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారనీ.. జగన్‌ కుట్రలు గుర్తించిన ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు.

English summary
Andhra Pradesh minister Ayyanna Patrudu on Saturday lashed out at YSRCP MLA RK Roja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X