వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పటి కేసుకు ఇప్పుడా?: కోర్టు నోటీసులపై అయ్యన్న ఆశ్చర్యం

ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు శుక్రవారం ఎలమంచిలి కోర్టుకు హాజరయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘన కేసుకు సంబంధించి నోటీసులు అందడంతో ఆయన కోర్టుకు వచ్చారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పాయకరావుపేట నియోజకవర్గంలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘన కేసుకు సంబంధించి నోటీసులు అందడంతో మంత్రి అయ్యన్నపాత్రుడు శుక్రవారం ఎలమంచిలి కోర్టుకు హాజరయ్యారు.

నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట గ్రామంలోని ఆలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా 2012 ఏప్రిల్‌ 29న ప్రచారం నిర్వహించినట్టు మంత్రి అయ్యన్నతో పాటు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, మరో నలుగురు వ్యక్తులపై మే నెలలో కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.

Andhra Pradesh minister Ayyanna Patrudu shocked with court notice in 2012 case.

ఈ కేసుకు సంబంధించి వారం రోజుల క్రితం కోర్టు నుంచి సమన్లు అందడంతో ఎలమంచిలి కోర్డుకు వచ్చినట్టు మంత్రి అయ్యన్న తెలిపారు. అయితే అప్పటి కేసుకు సంబంధించి ఇప్పుడు సమన్లు రావడంపై అయ్యన్న ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అక్టోబర్ 6వ తేదీకి న్యాయమూర్తి కేసు విచారణ వాయిదా వేసినట్టు మంత్రి చెప్పారు.
కాగా, చైర్‌పర్సన్‌ రమాకుమారి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆడారి ఆనందకుమార్‌, ప్రధాన కార్యదర్శి పిట్టా శ్రీనివాస్‌ తదితరులు కోర్టు ఆవరణలో మంత్రిని కలిశారు.

English summary
Andhra Pradesh minister Ayyanna Patrudu shocked with court notice in 2012 case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X