• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గంజాయి స్మగ్లింగ్‌తో అయ్యన్న డాన్‌గా మారారు-ఆయనకు పిచ్చికుక్కకు తేడా లేదు-సొంత సోదరుడి సంచలన వ్యాఖ్యలు

|

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కోడెల వర్దంతి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్,మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అధికార-ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేశాయి. అయ్యన్న వ్యాఖ్యలకు వైసీపీ నుంచి గట్టి కౌంటర్స్ వస్తున్నాయి. తాజాగా అయ్యన్నపాత్రుడిపై ఆయన సొంత సోదరుడు,వైసీపీ నేత సన్యాసిపాత్రుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.గంజాయి స్మగ్లింగ్ కార్యకలాపాలతో అయ్యన్నపాత్రుడు డాన్‌గా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ పాలన చూసి ఓర్వలేకనే...

జగన్ పాలన చూసి ఓర్వలేకనే...

సీఎం జగన్ పరిపాలనను చూసి ఓర్వలేకనే అయ్యన్న ఇలా మాట్లాడుతున్నారని సన్యాసిపాత్రుడు మండిపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలియజేసేందుకు వెళ్లిన జోగి రమేష్‌పై బుద్ధా వెంకన్న, టీడీపీ గూండాలు దాడి చేశారని ఆరోపించారు.జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసం చేశారన్నారు.అసలు నిరసన తెలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. దానికి కారణం ఎవరని అన్నారు. చంద్రబాబు నాయుడు బుద్దా వెంకన్న లాంటి రౌడీలను కాపలా పెట్టుకుని దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

గంజాయి స్మగ్లింగ్.. డాన్‌గా అయ్యన్న...

గంజాయి స్మగ్లింగ్.. డాన్‌గా అయ్యన్న...

నర్సీపట్నం గంజాయి స్మగ్లింగ్ చేసి అయ్యన్నపాత్రుడు డాన్‌గా తయారయ్యారని సన్యాసిపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నర్సీపట్నం మున్సిపల్ మహిళా కమిషనర్‌ని బట్టలు ఊడదీస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. అయ్యన్నపాత్రుడు అక్రమాస్తుల చిట్టా బయటకు తీస్తామని.. అందులో చంద్రబాబు వాటా ఎంతో తేలుస్తామని అన్నారు. కోడెల వర్దంతి సభలో అయ్యన్నపాత్రుడు ఎన్ని పెగ్గులు వేసి మాట్లాడారని ఎద్దేవా చేశారు. పెగ్గేనా, గంజాయి కూడా తీసుకున్నారా అంటూ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం గురించి గానీ సీఎం జగన్ గురించి గానీ మాట్లాడే అర్హత అయ్యన్నకు లేదన్నారు.

అయ్యన్నకు పిచ్చి కుక్కకు తేడా లేదు...

అయ్యన్నకు పిచ్చి కుక్కకు తేడా లేదు...

చంద్రబాబు ఏనాడు ఎన్నికల్లో సొంతంగా గెలిచింది లేదని సన్యాసతిపాత్రుడు విమర్శించారు.చంద్రబాబుకి ఎన్నికలంటే ఎంత భయమే అందరికీ తెలుసన్నారు.చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే 2019 ఫలితాలే వస్తాయన్నారు.ఇకనైనా అయ్యన్నపాత్రుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని.. ఆయనకు పిచ్చి కుక్కకు పెద్ద తేడా లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులను తాలిబన్లుగా మార్చారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజంలో ఎవరూ సమర్ధించే రీతిలో లేవన్నారు.

అయ్యన్నపై కేసు నమోదు

అయ్యన్నపై కేసు నమోదు


కోడెల వర్ధంతి సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ,దాడులు చోటు చేసుకున్నాయి.అయితే దాడులు మీరంటే మీరే చేశారని ఇరువురు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇది చంద్రబాబు ఇంటిపై వైసీపీ దండయాత్ర అని టీడీపీ నేతలు అంటుంటే... టీడీపీ గూండాలే తమపై దాడులకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. అయ్యన్న వ్యాఖ్యలపై తాజాగా మంత్రి అయ్యన్నపాత్రుడుపై గుంటూరు జిల్లా నకరికల్లు పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. మాజీ సర్పంచ్, వైసీపీ నేత కంఠంనేని కోటేశ్వరరావు ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు.మరోవైపు అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ నర్సీపట్నంలోని ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు వైసీపీ నేతలు యత్నించారు.ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి.

English summary
Former minister,TDP senior leader Ayyannapatrudu derogatory comments on CM YS Jagan and ministers getting severe criticism from YSRCP.Sanyasipatrudu,brother of Ayyannapatrudu criticised him for his remarks against CM Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X