వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయసాయి, బొత్స, అవంతి అవినీతి: రూ.23 కోట్లు కొట్టేశారు, అయ్యన్న ఆరోపణలు..

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు అందరూ అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ. 4 వేల వరకు దోపిడీ జరిగిందని ఆరోపించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నా సీఎం జగన్ మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. దీనిని బట్టి అవినీతిలో సీఎంకు కూడా భాగం ఉందేమోనని ప్రజలు అనుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

విశాఖపట్టణం కేంద్రంగా విజయసాయి రెడ్డి చేస్తోన్న దోపిడీ జగన్‌కు తెలియదా అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ భూములు, సింహాచలం భూములు కొట్టేయడానికి విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైజాగ్ పరిధిలో ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే భూమి చదును పేరుతో విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ రూ. 23 కోట్లు కొట్టేశారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ayyannapatrudu slams cm ys jagan..

Recommended Video

IPL 2020 : UAE లో తిష్ట వేసిన బుకీలు.. ACU విచారణ | Player Alerts BCCI | Oneindia Telugu

దీంతోపాటు మంత్రి జయరాం అవినీతి భాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టామని గుర్తుచేశారు. మరీ ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.. అవినీతి మంత్రిని సీఎం జగన్ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఒకవేళ మంత్రి జయరాంపై చర్యలు తీసుకుంటే.. మీ అవినీతిని ఆయన ఎక్కడ బయటపెడతారో భయపడుతున్నారా అని నిలదీశారు. అవినీతికి సంబంధించి జయరాంపై చర్యలు తీసుకోకుంటే తాము కోర్టుకెళతామని అయ్యన్నపాత్రుడు చెప్పారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

English summary
some ysrcp leaders are involved in corruption in the state tdp leader ayyannapatrudu alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X