కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధింపులతో బీఫార్మసీ గర్ల్ సూసైడ్, ఉరేసుకొని విద్యార్థి

By Srinivas
|
Google Oneindia TeluguNews

B Pharmacy girl commits suicide
కరీంనగర్/హైదరాబాద్/విశాఖ: ప్రేమ వేధింపులు తట్టుకోలేక బి ఫార్మసీ విద్యార్థిని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది! వీణవంక మండలానికి చెందిన బి ఫార్మసీ విద్యార్థిని మంగళవారం అర్ధరాత్రి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ప్రేమ వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.

నగల దుకాణం కేసులో నిందితుడి అరెస్టు

విశాఖలో రెండు నెలల క్రితం జరిగిన నగల దుకాణం దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. అతని నుండి 220 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఉరేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాదులోని శ్రీ మేధా కళాశాలలో ఇంటర్ చదువుతున్న భవాని సాయి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం వైఖరే మృతికి కారణమంటూ కళాశాల ఎదుట, వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు.

English summary
A B Pharmacy student allegedly committed suicide by jumping into well in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X