విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి దశ తిరగనుందా?: అమరావతికి అండగా అబుదాబి ఎన్నారై

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: అంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో సుమారు రూ. 12 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అబుదాబికి చెందిన ఎన్నారై పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి ప్రకటించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో రూ. 12వేల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి మే 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో అబుదాబీకి చెందిన ఎన్‌ఎమ్‌సి గ్రూప్‌ సంస్ధ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం రాత్రి ఆయన సమావేశమయ్యారు. అనంతరం విజయవాడ నుంచి ఆయన తిరిగివెళ్తూ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అబుబాబీ నగర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన తన సంస్థ ప్రస్తుతం అమరావతి అభివృద్ధికి కృషి చేయనున్నట్లు ప్రకటించారు.

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

అమరావతి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పిన ఆయన తాను అమరావతికి మార్కెటింగ్ పర్సన్ లా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అమరావతిలో పెట్టుబడులు పెట్టేలా ఆయా దేశాల వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తానని తెలిపారు.

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

అమరావతిలో ఉన్న అపార అవకాశాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలకు సవివరంగా చెబుతానని ఆయన తెలిపారు. కాగా రాజధాని అమరావతి ప్రాంతంలో తాము చేపట్టనున్న కన్వెన్షన్‌ సెంటర్ దేశంలోనే అతిపెద్దదిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

ఒకేసారి 10 వేలమంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్‌ నిర్మాణం చేపడతామని ఆయన పేర్కొన్నారు. కన్వెన్షన్ సెంటర్‌‌తో పాటు ఫైవ్ స్టార్ హోటల్‌, ఎగ్జిబిషన్ సెంటర్‌ కూడా నిర్మించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. జర్మనీలోని హనోవర్‌ ఫెయిర్‌కు దీటుగా ఉండేలా ఈ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

2018 నాటికల్లా నిర్మాణాలు పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీటితో పాటు 3500 పడకల కూడిన ఆసుపత్రులనూ నెలకొల్పుతామన్నారు. హద్రోగ, మధుమేహ, క్యాన్సర్‌ విభాగాలతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులుగా వాటిని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబుకు వివరించారు.

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

అమరావతిలో 1500, కర్నూలులో 300 పడకలు, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 1700 పడకలతో కూడిన ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. పరిశోధనలకు ఊతమిచ్చే ప్రపంచస్థాయి మెడికల్‌ అనలిటిక్‌ సెంటర్‌ (వైద్య విశ్లేషణాత్మక కేంద్రం)ను, ఆసియాలోనే తొలి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ను అమరావతిలో నెలకొల్పుతున్నట్టు సీఎం చంద్రబాబుకు ఆయన వివరించారు.

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

అమరావతి అభివృద్ధికి అబుదాబి ఎన్నారై మద్దతు

వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్‌ ఐవీ లీగ్‌ విశ్వవిద్యాలయం వైజ్ఞానిక భాగస్వామిగా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు సంస్ధ ముందుకొచ్చింది. ఫైజర్‌, మెర్క్‌, అబాట్స్‌ వంటి ప్రసిద్ధ ఫార్మా సంస్థలతో కలిసి ఫార్మాస్యూటికల్‌ తయారీ కేంద్రంతో పాటు ప్రపంచ స్థాయి గోల్ఫ్‌ కోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు.

English summary
B.R. Shetty Group Meeting with CM Chandrababu at residency in vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X