వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ వివేకానంద హత్యకేసు: హత్యకు ముందు రోజు హోటల్‌లో బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డి భేటీ..

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగాన్ని పెంచింది. వివేకానంద హత్యతో సంబంధం ఉందని భావిస్తోన్న ప్రతీ ఒక్కరినీ విచారిస్తున్నారు. ఇప్పటికే 1300 మంది పైచిలుకు మందిని ఎంక్వైరీ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని కూడా విచారించారు. అనుమానం ఉంటే మళ్లీ పిలిచి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అంతకుముందు కూడా..

అంతకుముందు కూడా..


వైఎస్ వివేకానంద హత్య జరిగిన తర్వాతే కాదు, అంత్ెముందు నాటి పరిణామాలను కూడా పరిశీలిస్తున్నారు. వివేకా హత్యకు ముందు మార్చి 14వ తేదీన కడపలో గల హరిత హోటల్‌లో బీటెక్ రవి బస చేశారు. అయితే ఆయనతోపాటు పరమేశ్వర రెడ్డి కూడా హోటల్‌లో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. 104 గదిలో వీరిద్దరూ సమావేశమైనట్టు సిట్ అధికారులకు సమాచారం లభించింది.

నమోదుకాని పేర్లు..

నమోదుకాని పేర్లు..

హోటల్ రికార్డుల్లో మాత్రం అధికారికంగా బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డి పేర్లు నమోదు కాలేదు. ఇతరుల పేర్లతో తీసుకున్న గదిలో వీరు సమావేశమయ్యారు. తమ పేర్లు ఎందుకు నమోదు చేయలేదు, ఇతరుల పేర్లు నమోదు చేయడంలో ఆంతర్యం ఏంటీ అనే అంశాలపై సిట్ సిబ్బందికి అనుమానాలు కలిగాయి. పరమేశ్వర రెడ్డి, బీటెక్ రవి హోటల్‌లో ఎందుకు సమావేశమయ్యారనే ప్రశ్న సిట్ సిబ్బంది మెదడును తొలచివేస్తోంది.

సీసీటీవీ ఫుటేజీ

సీసీటీవీ ఫుటేజీ

వారిద్దరూ ఏం అంశాలపై చర్చించుకున్నారనే అంశంపై సిట్ ఆరాతీస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని హోటల్ సిబ్బందిని సిట్ కోరింది. అయితే హోటల్ ప్రాంగణంలో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని హోటల్ నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో ఆ రోజు ఏం జరిగింది ? ఏయే విషయాలపై చర్చించారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

హోటల్ టు హాస్పిటల్

హోటల్ టు హాస్పిటల్

హరిత హోటల్‌లో సమావేశం ముగిసిన వెంటనే పరమేశ్వర రెడ్డి ఆస్పత్రిలో చేరిపోయారు. కడపలో గల సన్ రైజ్ ఆస్పత్రిలో చేరారు. దీంతో సిట్ అధికారుల అనుమానాలకు మరింత బలం చేకూరినట్లైంది. బీ టెక్ రవితో సమావేశం తర్వాత వెళ్లి ఆస్పత్రిలో చేరడం అంటే పక్కా ప్రణాళిక ప్రకారం పరమేశ్వర రెడ్డి వ్యవహారించారని అర్థమవుతోంది. దీంతో బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

English summary
b.tech ravi, parameshwara reddy met haritha hotel before vivekananda murder
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X