చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్ల, నగలు చోరీ: బిటెక్ విద్యార్థి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన ఓ బిటెక్ విద్యార్థి దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. మదనపల్లె నీరుగట్టుపల్లెకు చెందిన రాజేష్ నెల్లూరులో ట్రిపుల్ఈ చదువుతున్నాడు. నెల్లూరు నగరంతో పాటు మదనపల్లెకు వచ్చినప్పుడు ఇళ్లలో చొరబడి చోరీలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు.

విలువైన ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, సెల్‌ఫోన్లు, నగలు, నగదు చోరీ చేసేవాడు. శనివారం ఉదయం మదనపల్లెలో ఉండగా పోలీసులు వలపన్ని అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువైన ల్యాప్‌టాప్‌లు, నగలు, ఓ స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 B Tech student arrested for theft

రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే కార్యాలయంలో ఓ వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతి చెందిన వ్యక్తిని గుంతకల్లులో డిపిఓ సెక్షన్ ఆఫీస్ సూపరింటిండెంట్‌గా పనిచేస్తున్న అజీజ్ పాషా (42)గా గుర్తించారు.

మృతుడు కర్నూలు జిల్లా వాసి అని తెలిపారు. ఇతనికి పెళ్లి కాలేదు. ఒంటరిగా శాంతినగర్‌లోని 625 నంబర్ క్వార్టర్‌లో ఉంటున్నాడు. అయితే శనివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండగా ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

English summary
A BTech student has been nabbed by police at Madanapalle in Chittoor district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X