గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓ ప్రాణాన్ని కాపాడిన రాజమౌళి సినిమా: బాహుబలి చూపిస్తూ ఆపరేషన్

గుంటూరులోని తులసీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు బాహుబలి సినిమా చూపిస్తూ వినూత్నంగా శస్త్ర చికిత్స చేశారు. ఈ సంఘటన కొద్ది రోజుల క్రితం జరిగింది.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరులోని తులసీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు బాహుబలి సినిమా చూపిస్తూ వినూత్నంగా శస్త్ర చికిత్స చేశారు. ఈ సంఘటన కొద్ది రోజుల క్రితం జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ఇంట్రా ఆపరేటివ్ నేవిగేషన్ విధానంతో ఈ శస్త్ర చికిత్స చేసినట్లు వైద్యులు చెప్పారు. గుంటూరుకు చెందిన వేశపోగు వినయ కుమారి ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తోంది.

ఫిట్స్ రావటంతో ఆసుపత్రికి

ఫిట్స్ రావటంతో ఆసుపత్రికి

ఈ మధ్య ఆమెకు పిట్స్ వచ్చాయి. దీంతో గుంటూరు తులసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ న్యూరాలజీ డాక్టర్‌ను సంప్రదించారు. ఆమెకు మెదడులో రక్తం గడ్డ కట్టిందని ఆపరేషన్ ద్వారా ఆ గడ్డ తొలగించాలని చెప్పారు.

ఆపరేషన్ జరుగుతున్నంత సేపు చేతులు, వేళ్లు కదపాలి

ఆపరేషన్ జరుగుతున్నంత సేపు చేతులు, వేళ్లు కదపాలి

అయితే ఆమె ఆపరేషన్ జరుగుతున్నంతసేపు సహకరించాల్సి ఉంటుందని చేతులు వేళ్లు కదపాలని అందువల్ల మత్తు మందు ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో ఆపరేషన్ అంటే భయం పోగొట్టేందుకు ఆమెకు ఇష్టమైన బాహుబలి 2 సినిమాను ఆపరేషన్ థియేటర్లో ప్రదర్శించారు.

బాహుబలి సినిమా చూపిస్తూ

బాహుబలి సినిమా చూపిస్తూ

బాహుబలి సినిమా చూస్తూ ఆ సినిమాలోను దండాలయ్యా... దండాలయ్యా పాటను పాడుతూ ఆమె డాక్టర్లకు సహకరించింది. తనకు సినిమా సరిగా కనిపించడం లేదని, దూరంగా ఉండటం వల్ల స్క్రీన్ సరిగా కనిపించడం లేదని, కాస్త దగ్గరకు పెట్టాలని కూడా డాక్టర్లను కోరింది.

సోషల్ మీడియాలో ఈ ఆపరేషన్ వైరల్

సోషల్ మీడియాలో ఈ ఆపరేషన్ వైరల్

ఇదేం సినిమా అని డాక్టర్లు అడగ్గా.. ఆ సినిమా పేరును ఉత్సాహంగా చెప్పింది. సుమారు గంటన్నర పాటు డాక్టర్లు శ్రమపడి ఆమె మెదడులో ఉన్న గడ్డను విజయవంతంగా తొలగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ అయింది.

English summary
The humongous box office collections of ‘Baahubali: The Conclusion’ might give the impression that the film was loved by all and sundry. However, there’s also a section of the audience who felt that some of the larger-than-life action sequences were just too over-the-top and too good to be true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X