వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో రామ్‌దేవ్: నవ్వుతూ రాయపాటి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని బాబా రామ్‌దేవ్ ఉక్కు మనిషిగా అభివర్ణించారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ చంద్రబాబు ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ దేవ్ గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే విభజనను చేపట్టారని ఆయన కాంగ్రెసును విమర్శించారు. నీళ్లు, విద్యుత్తు, ఉద్యోగ సమస్యలపై స్పష్టత లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన ప్రశ్నించారు. ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించడాన్ని ఎవరూ కాదనడం లేదని, అయితే ఒక ప్రాంతంవారి సమస్యలను పట్టించుకోవడం వల్ల సమస్య తీవ్రమైందని ఆయన అన్నారు.

చంద్రబాబు దీక్షతోనైనా కాంగ్రెసు పార్టీకి సిగ్గు వస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెసు పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని రామ్‌దేవ్ అన్నారు. కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు నడుపుతోందని ఆయన విమర్శించారు.

కాగా, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఆయన గురువారం సాయంత్రం చంద్రబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ కుమార్ మహంతా కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపారు.

లోకేశ్‌తో బాబు

లోకేశ్‌తో బాబు

కుమారుడుతో చంద్రబాబు మాట్లాడుతుండగా ఆ ప్రక్కనే భువనేశ్వరి.

వేదికపైకి వస్తున్న బాబు

వేదికపైకి వస్తున్న బాబు

దీక్షా స్దలంపైకి సెక్యూరిటీ గార్డు సహాయంతో వస్తున్న చంద్రబాబు

బస్సులోకి ఎక్కుతున్న బాబు

బస్సులోకి ఎక్కుతున్న బాబు

సెక్యూరిటీ గార్డు సహాయంతో బస్సులోకి వెళుతున్న చంద్రబాబు

 బాబా రామ్ దేవ్ తో బాబు

బాబా రామ్ దేవ్ తో బాబు

దీక్ష చేస్తున్న చంద్రబాబుకి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బాబా రామ్ దేవ్

బాబా రామ్ దేవ్ తో బాబు

బాబా రామ్ దేవ్ తో బాబు

దీక్ష చేస్తున్న చంద్రబాబుకి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బాబా రామ్ దేవ్తో మాటామంతీ

బాబుకి సంఘీభావం తెలుపుతున్న బాదల్

బాబుకి సంఘీభావం తెలుపుతున్న బాదల్

గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించిన బాదల్.

బాబుతో రాయపాటి

బాబుతో రాయపాటి

చంద్రబాబు దీక్షాస్దలి వద్దకు చేరుకోని సంఘీబావం తెలుపుతున్న రాయపాటి. దీంతో రాయపాటి త్వరలో తెలుగుదేశంలోకి చేరతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

డాకర్ల పర్యవేక్షణలో బాబు

డాకర్ల పర్యవేక్షణలో బాబు

చంద్రబాబు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్న డాక్టర్లు

English summary
Yoga guru Baba Ramdev visited Telugudesam party president Nara Chandrababu Naidu's fasting camp and extended his support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X