వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠంగా యోగా: చంద్రబాబుతో రామ్‌దేవ్ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యోగా గురు రామ్‌దేవ్ బాబా మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ను కూడా ఆయన కలిశారు. సీమాంధ్ర నూతన ద్రష్టగా రామ్‌దేవ్ బాబా చంద్రబాబును అభివర్ణించారు.

చంద్రబాబుతో కలిసిన విషయాన్ని ట్విట్టర్‌లో రాశారు. చంద్రబాబును తన తొలి అన్నయ్యగా ఆయన చెప్పుకున్నారు. నాయకుడిగా కన్నా చంద్రబాబును తాను అన్నయ్యగానే చూస్తానని రామ్‌దేవ్ అన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను తమ్ముడిగా చూస్తానని ఆయన చెప్పారు.

Baba Ramdev meets AP CM nara Chandrababu

యోగాను, ఆధ్యాత్మిక జ్ఝానాన్ని విద్యా సంస్థల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని తాను చంద్రబాబును కోరినట్లు ఆయన తెలిపారు. అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు ట్వీట్ చేశారు. తిరుపతి బాలాజీ దేవస్థానం సమీపంలో యోగా, ఆయుర్వేదం, నేచురోపతిలకు చెందిన భారీ పతంజలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు ఆయన తెలిపారు.

రామ్‌దేవ్ బాబా మొదటి నుంచీ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బిజెపికి కూడా ఆయన అనుకూలంగా వ్యవహరించారు.

English summary
Yoga Guru Baba Ramdev held a meeting with the newly- elected Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu and his son Nara Lokesh in Hyderabad on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X