వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ తీర్పు : సనాతనధర్మం రక్షించబడిందన్న స్వరూపానంద, ఇది హిందువుల విజయమన్న శ్రీనివాసానంద

|
Google Oneindia TeluguNews

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కాదని, వీటికి సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్కే యాదవ్ పేర్కొన్నారు. 2010లో తీర్పును న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొన్న ఎల్కే అద్వానీ , మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి తో సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. 28 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ కేసులో తుది తీర్పు వెలువడటం సంచలనం కాగా, సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హిందూ సంఘాలు ,స్వామీజీలు బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడిందని హర్షం వ్యక్తం చేసిన స్వరూపానందేంద్ర

ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడిందని హర్షం వ్యక్తం చేసిన స్వరూపానందేంద్ర

బాబ్రీ కేసును సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేయడంపై విశాఖ శారదా స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కోర్టులో తేలకుండా ఉన్న ఈ కేసును కొట్టివేయడం సంతోష దాయకమని ఆయన పేర్కొన్నారు . అంతేకాదు 28 ఏళ్ల నిరీక్షణకు తెర పడడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర. ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో బాబ్రీ వివాదానికి పూర్తిగా తెరదించినట్లు అయిందని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్నిస్వాగతిస్తున్నామని చెప్పిన స్వరూపానందేంద్ర మోడీ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.

ఈ తీర్పు హిందువులందరి విజయం : శ్రీనివాసానంద సరస్వతి

ఈ తీర్పు హిందువులందరి విజయం : శ్రీనివాసానంద సరస్వతి


బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ కోర్టు తీర్పుపై శ్రీనివాసానంద సరస్వతి కూడా హర్షం వ్యక్తం చేశారు. కరసేవకులు నిర్దోషులుగా తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నాటి ప్రభుత్వ హయాంలో కరసేవకులపై అక్రమంగా కేసులు పెట్టారని, ఈరోజు ఇచ్చిన తీర్పు హిందువులందరి విజయమని శ్రీనివాసానంద సరస్వతి వ్యాఖ్యానించారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు తీర్పును ఆర్‌ఎస్‌ఎస్ బుధవారం స్వాగతించింది . అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా ఈ కేసు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

స్వాగతించిన హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్ , విశ్వహిందూ పరిషత్

స్వాగతించిన హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్ , విశ్వహిందూ పరిషత్

బాబ్రీ మసీదు విషయంలో ఇచ్చిన తీర్పుతో ఇక నుండైనా అందరూ సామరస్యంగా ఉండాలని కోరింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ . వివాదాస్పద బాబ్రీ నిర్మాణాన్ని కూల్చివేసిన కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించాలన్న ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్ణయాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వాగతించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన సిబిఐ కోర్టు తీర్పును విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) స్వాగతించింది . ప్రవీణ్ తోగాడియాకు నేతృత్వంలోని అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ (ఎహెచ్‌పి) ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసింది .ఈ నిర్ణయం చారిత్రక నిర్ణయంగా వీహెచ్పీ అభివర్ణించింది. ఏపీలోనూ హిందూ సంఘాలు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

English summary
Visakha Sharada Swaroopanandendra Swamy expressed happiness over the dismissal of the Babri case by the CBI special court. He said it was a matter of happiness to dismiss the case, which had been pending in court for decades. Srinivasananda Saraswati also hailed the CBI court verdict in the Babri Masjid demolition case. He said the hindus were happy .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X