వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజుకు రెండు లోక్ స‌భ నియోజ‌కవ‌ర్గాల‌పై బాబు స‌మీక్ష‌.!లోపాలు అదిగ‌మించేందుకు టీడిపి ప్ర‌య‌త్నాలు.!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/ హైద‌రాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉండటంతో అభ్యర్ధుల ఎంపిక వ్యవహారంలో వేగం పెంచుతున్నారు టీడీపీ అధ్యక్షుడ చంద్రబాబు నాయుడు. నేటి నుంచి రోజుకు రెండు పార్లమెంటు స్థానలపై సమీక్షలు నిర్వహించి అభ్యర్ధులను ఖారారు చెయ్యడానికి చంద్రబాబునాయుడు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో రోజుకు 14 అసెంబ్లీ స్ధానాలకు కూడా అభ్యర్ధుల ఎంపిక పూర్తవుతుందనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు సమాచారం. ఒక్కో అసెంబ్లీ పరిధి నుంచి 60 మంది క్రియాశీలక నాయకులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అభ్యర్ధుల ఎంపికలో నియోజకవర్గ పరిశీలకులకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.

నేడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు, నర్సాపురం పార్లెమెంటు స్ధానాలపై సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. నరసాపురం పార్లమెంటు పరిధిలో పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకు, నరసాపురం అసెంబ్లీ స్ధానల్లో సిట్టింగులకే అవకాశం ఉంటుందని, భీమవరం, తాడేపల్లిగూడెం, స్ధానాలకు కొత్త అభ్యర్ధులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

Babu 2 lok sabha review meetings per day..! To overcome the drawbacks..

అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో దెందులూరు, ఉంగుటూరు స్ధానాలు తప్పి మిగిలిన స్ధానాల్లో సిట్టింగులను మార్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. పోలవరం, చింతలపూడి, ఏలూరు, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ స్ధానాల్లో సిట్టింగ్ శాసనసభ్యులకు ఈ సారి అవకాశం దక్కకపోవచ్చని టీడీపీ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
TDP president Chandrababu Naidu is increasing the speed of selection of candidates with the short term for the general election. Chandrababu Naidu is ready to conduct the review of the two parliamentary seats in the days from today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X