వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ..మౌనీ బాబా అయ్యారు.. జగన్ క్యాబినెట్ పై చంద్రబాబు మాట్లాడరేం

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రతిపక్ష పార్టీలు వేలెత్తి చూపించకుండా పారదర్శక పాలన ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఏపీ మంత్రివర్గ ఏర్పాటులోనూ ఆయన కొత్త ఒరవడి సృష్టించారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు గా ప్రకటించి అన్ని సామాజికవర్గాలకు సమన్యాయం పాటించారు. పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి తన నిర్ణయంతో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ పై ప్రతిపక్ష పార్టీలకు ఆరోపణలు చెయ్యటానికి, వేలెత్తి చూపటానికి ఆస్కారం లేకుండా పోయింది.

ఆయన పోటీ చెయ్యనన్నా చంద్రబాబే బలవంతం చేశారట .. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్ ఆయన పోటీ చెయ్యనన్నా చంద్రబాబే బలవంతం చేశారట .. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్

క్యాబినెట్ పై చంద్రబాబు మాట్లాడరేం .. మౌనీ బాబా అయ్యారా అన్న వైసీపీ నేత

క్యాబినెట్ పై చంద్రబాబు మాట్లాడరేం .. మౌనీ బాబా అయ్యారా అన్న వైసీపీ నేత

అదలా ఉంటే వైసీపీ లో కీలక నాయకుడు జగన్ కు మంత్రిలా సలహాలిచ్చే నాయకుడు విజయసాయి రెడ్డి మరోసారి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. జగన్ మంత్రి వర్గంపై చంద్రబాబు కనీసం స్పందించలేదని విజయసాయి ఆరోపించారు. క్యాబినెట్ కూర్పుపై ప్రశంసించటానికి చంద్రబాబుకు నోరు రావటం లేదని ఆయన అన్నారు. ‘‘ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్ధరిస్తానని కోతలు కోసిన చంద్రబాబుకు జగన్ గారి కేబినెట్ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులివ్వడంపై ఏ వ్యాఖ్యా చేయకుండా మౌనీ బాబా అయ్యారు బాబు.'' అని చంద్రబాబు ప్రస్తుతం మౌనీ బాబా అంటూ వ్యాఖ్యానించారు.

బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్ధికంగా ఎదిగేలా చెయ్యనున్న జగన్ అంటూ కితాబు

బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్ధికంగా ఎదిగేలా చెయ్యనున్న జగన్ అంటూ కితాబు

అంతే కాదు మరో ట్వీట్ లో జగన్ గారి కేబినెట్లో 60% మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన వారేనని ఆయన పేర్కొన్నారు . దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని విజయసాయి చెప్పుకొచ్చారు . ఇది ఖచ్చితంగా బలహీనవర్గాల ప్రభుత్వమే. బీసీలకు 50% నామినేషన్ పనులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని జగన్‌ గారు హామీ ఇచ్చారని విజయసాయి పేర్కొన్నారు . ఇక జగన్ పై , జగన్ పాలనపై ఆయన ప్రశంసలు కురిపించారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసం చెప్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 పాలకుడికీ మానిప్యులేటర్ కు తేడా ఉందని పేర్కొన్న విజయసాయి

పాలకుడికీ మానిప్యులేటర్ కు తేడా ఉందని పేర్కొన్న విజయసాయి

ఇంకా అంతే కాదు పాలకుడికీ మానిప్యులేటర్ కు తేడా ఉందని చెప్తూ మరో ట్వీట్ చేశారు.‘‘తమ వేతనాన్ని 3 వేల నుంచి 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన 'ఆశా' అక్కా చెల్లెళ్లపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులను ఉసిగొల్పి అరెస్టు చేయించాడు చంద్రబాబు. సీఎం జగన్ గారు ముందస్తు హామీ ఇవ్వకున్నా వారి వేతనాలను 300% పెంచుతూ కొత్త ఆశలు నింపారు. పాలకుడికి, మ్యానిపులేటర్‌కి తేడా ఇదే బాబూ.'' అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

English summary
Former AP Chief Minister TDP chief Chandrababu Naidu has been criticized by Vijayasai Reddy once again , Vijayasai Reddy alleged that Chandrababu did not react on the Jagan's cabinet. He said that Chandrababu does not have a mouth to praise the Cabinet's composition. Chandrababu, who has praised the BC's and the Kapu's during the election, does not come to acknowledge Jagan's Cabinet structure. Babu became silent, without any comment and he became Mauni Baba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X