వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలపక్షం: పవన్, జగన్, బిజెపిల ఆహ్వనానికి మంత్రులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ప్రత్యేక హోదా విషయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హజరుకావాలని జనసేన, వైసీపీ, బిజెపి నేతల వద్దకు మంత్రులు పంపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం అమరావతిలో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొన్నారు. అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు హజరయ్యేలా చూడాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

Babu decides to send ministers to invite jagan, pawan and Bjp

గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ, జనసేన, బిజెపి నేతలు హజరుకాలేదు. దీంతో ఈ మూడు పార్టీల నేతలను అఖిలపక్ష సమావేశానికి హజరయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ మేరకు మంత్రులు, టిడిపి నేతలు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహించే ప్రాంతానికి వెళ్ళి అఖిలపక్ష సమావేశానికి హజరుకావాలని పిలవనున్నారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కూడ ఇదే విషయమై మంత్రులు, సీనియర్ టిడిపి నేతలు వెళ్ళి అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వనం పలకనున్నారు. బిజెపి నేతలకు కూడ మంత్రులు, సీనియర్ నేతలు వెళ్ళి ఆహ్వనాలు పంపనున్నారు.

అఖిలపక్ష సమావేశానికి ఈ మూడు పార్టీలు హజరుకాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని పార్టీలను కలుపుకు వెళ్ళేందుకు ప్రయత్నాలు చేసిందనే సంకేతాలు వెళ్ళినట్టుగా ఉంటుందని టిడిపి నాయకత్వం భావిస్తోంది.

రాకపోతే విపక్షాలు రాష్ట్రప్రభుత్వానికి సహకరించలేదనే విమర్శలు చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం దక్కనుంది. మరోవైపు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామనే సంకేతాలను ఇచ్చేందుకు మంత్రులు, సీనియర్ నేతలు ఈ మూడు పార్టీల నేతల వద్దకు వెళ్ళనున్నారని సమాచారం.

English summary
AP CM Chandrababu Naidu decided to send ministers to invite Janasena, ysrcp, BJP leaders to attend the all-party meeting over special status.Chandrababunaidu conducted meeting with ministers at Amaravathi on Thursday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X