వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు - జ‌గ‌న్ ల విదేశీ టూర్లు ర‌ద్దు ..జంపింగ్‌ల భ‌య‌మే కార‌ణ‌మా: ఈ వార‌మే కీల‌కం..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ప్ర‌ధాన పార్టీలు వ్యూహా ప్ర‌తి వ్యూహాల‌తో పాటుగా నిర్ణ‌యాల విష‌యంలోనూ పోటీ ప‌డుతున్నారు. తాజాగా, ముఖ్య‌మంత్రి దావోస్ ప‌ర్య‌ట‌న‌..జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌ను ర‌ద్దు చేసుకున్నారు. దీని వెనుక అస‌లు కార‌ణం ఏంట‌ని ఆరా తీస్తే..ఏపిలో వేగంగా మారుతున్న రాజ‌కీయా ప‌రిణామాలు కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. అన్నింటికంటే..నేత‌ల జంపింగ్‌లు ఈ వారంలో ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. దీంతో.. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు..ఆక‌ర్ష్ మంత్రాల అమ‌లు కోసం వీరు టూర్లు ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది..

సీయం దావోస్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు..

సీయం దావోస్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు..

ఈ నెల 22 నుండి ముఖ్య‌మంత్రి దావోస్ ప‌ర్య‌ట‌న అధికారికంగా ఖ‌రారైంది. అయితే, రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల పై ముఖ్య‌మంత్రి అందుబాటులో ఉన్న మంత్రుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ సమావేశంలో జ‌గ‌న్ తో కెటి ఆర్ స‌మావేశంతో పాటుగా జాతీయ రాజ‌కీయాల్లో కూట‌ములు..పార్టీల తీరు పైనా చ‌ర్చ జ‌రిగింది. అయితే, సంక్రాంతి పండుగ త‌రువాత అధికార పార్టీ నుండి జంపింగ్‌లు ఉంటాయ‌నే స‌మాచారంతో ముఖ్య‌మంత్రి అప్ర‌మ‌త్త మ‌య్యారు. పార్టీ నుండి ఎవ‌రూ చే జారి పోకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త మంత్రుల‌కు అప్ప‌గించారు. అదే స‌మ‌యంలో వైసిపి నుండి వ‌చ్చే వారి పై దృష్టి పెట్టాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే విశాఖ కు చెందిన కొంద రు సీనియ‌ర్ నేత‌లు టిడిపిలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే స‌మ‌యంలో..బిజెపి సైతం ఏపి రాజ‌కీయాల పై దృష్టి పెట్టింద‌నే స‌మాచారం తో మంత్రులు దావోస్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకోవాల‌ని సీయం కు సూచించారు. దీంతో ముఖ్య‌మంత్రి త‌న దావోస్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు.

జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక‌..

జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక‌..

వైసిపి అధినేత జ‌గ‌న్ త‌న పాదయాత్ర అనంతరం.. సుమారు 15 నెలల తర్వాత తన పెద్ద కుమార్తె వర్షా రెడ్డిని చూడ టానికి కుటుంబంతో కలిసి లండన్‌కు వెళ్లాలనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టూర్ రద్దైందని పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే, ముఖ్య‌మంత్రి దావోస్ టూర్ ర‌ద్దు చేసుకొని ఇక్క‌డి రాజ‌కీయాల పై దృష్టి పెట్ట టం తో పాటుగా ప్ర‌కాశం..నెల్లూరు కు కొంద‌రు నేత‌లు టిడిపి నుండి వైసిపి లో చేరేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు స‌మా చారం. అయితే, వీరి పై ఒత్తిడి తెచ్చి పార్టీ మార్పు నిలువ‌రించేందుకు టిడిపి నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టిక్కెట్లు రావ‌ని భావిస్తున్న కొంద‌రు వైసిపి నేత‌ల పై టిడిపి ఆక‌ర్ష‌ణ మంత్రం వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న త‌రువాత .. కీల‌క‌మైన ఈ స‌మ‌యంలో విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌కుండా..ఇక్క‌డే ఉండి పార్టీ పైనే దృల‌ష్టి పెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. తాజాగా, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో చేరిక చ‌ర్చ‌లు.. టిడిపి విమ‌ర్శ‌ల నేప థ్యం లో జ‌గ‌న్ లండ‌న్ టూర్ ర‌ద్దు చేసుకొని పార్టీ వ్య‌వ‌హారాల పైనే దృష్టి పెట్ట‌నున్నారు.

ఇద్ద‌రి దీ ఒకే నిర్ణ‌యం..ఒకే టెన్ష‌న్..

ఇద్ద‌రి దీ ఒకే నిర్ణ‌యం..ఒకే టెన్ష‌న్..

అధికార,..ప్రతిపక్ష పార్టీల నేతలు ఇద్దరూ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవడంతో ఏపి రాజ‌కీయాల్లో ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ ప్రారంభ‌మైంది. అమ‌రావ‌తి లో అసలేం జ‌ర‌గుతుందో అర్దం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే సీయం చంద్ర‌బాబు వరుస భేటీలు, అర్ధరాత్రి వరకూ పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. పూర్తి గా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టిసారించారు. జ‌గ‌న్ సైతం త‌న పాద‌యాత్ర ముగిసిన త‌రువాత జిల్లాల వారీగా అభ్య‌ర్ధు ల ఎంపిక పై దృష్టి సారించారు. ఈ నెలాఖ‌రులోగా పార్టీలో చేరిక‌ల వ్య‌వ‌హారం పై క్లారిటీ వ‌స్తే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించా ల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టిడిపి - వైసిపి రెండు పార్టీలు త‌మ పార్టీల నుండి జంపింగ్‌లు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. దీంతో..ఇద్ద‌రు నేత‌లు ఇదే టెన్ష‌న్ తో త‌మ టూర్లు ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇ క‌, ఏపి లో రానున్న రోజుల్లో ప్ర‌తీ రోజు రాజ‌కీయంగా రెండు పార్టీల‌కు కీల‌కం గా మార‌నుంది.

English summary
AP C.M Chandra Babu and LOP Jagan cancelled their foreign visits due to huge political developments in AP. Now jumpings may start from all parties.Now both Babu and Jagan decisions creating political heat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X