వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గందరగోళం స్రుష్టించడానికే బాబు మరో ఎత్తుగడ..! ఏమార్చేందుకే ధర్నా డ్రామా అని కొట్టిపారేసిన వైసీపి..

|
Google Oneindia TeluguNews

విజయవాడ/హైదరాబాద్ : ప్రజాస్వామ్యానికి ఏ ప్రమాదం వచ్చిందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారని వైసీపీ ప్రశ్నిస్తోంది. విజయవాడలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం అధికారుల వద్దకు టీడీపీ అధ్యక్షుడిగా కాకుండా ముఖ్యమంత్రిగా సంతకం చేసిన 9పేజీల పత్రాలను ఇవ్వడంపై మండిపడ్డారు. నిన్న నిబంధనలకు విరుద్ధంగా 6.30 నిమిషాల వరకు ప్రచారంలోనే చంద్రబాబు ఉన్నారన్నారు. ఎన్నికల నిబంధనలు తెలియకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘంపై కోర్టులో ఫిర్యాదు చేయడమేమిటని ప్రశ్నించారు.

Babus plan to create confusion..!Dharna in front of EC office is a drama..! -ycp

2009లో ఎన్నికల సమయంలో డీజీపీని అధికారులు బదిలీ చేస్తే అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఒక్క మాట కూడా అనలేదని తెలిపారు. మీ ఏజెంట్ గా ఉన్నవారిని తొలగించారని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాల్సిన సమయంలో గందరగోళం సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందన్నారు. మే 23 తర్వాత వచ్చే ఫలితాలపై చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. సైకలాజికల్ గా ప్రజల్లో భయం సృష్టించేందకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఐటీ దాడులు జరగలేదని, రాష్ట్ర పోలీసులే వారి ఇండ్లలో సోదాలు నిర్వహించారన్నారు. వాళ్ల వ్యక్తులనే వారు పంపించుకుని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారన్నారని నాగిరెడ్డి మండిపడ్డారు.

English summary
The yCP asks the Election Commission to complain that there is no danger to democracy than why chandrababu suffering. The party leader spoke at a media briefing at the party's office in Vijayawada. On this occasion a complaint has been filed to the state election commission against chandra babu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X