వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అచ్చెన్నకు సీఎం జగన్ పలకరింపుతో..: ఈ నెల 17వరకు ఏపీ అసెంబ్లీ: బీఏసీలో ఆసక్తికర పరిణామాలు...!

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం బీఏసీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుండి ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. మొత్తం ఏడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14న రెండో శనివారం..15న ఆదివారం రోజుల్లో శాసనసభకు సెలవు ప్రకటించారు. ఇక, సభలో ఈ ఏడు రోజుల సమావేశాల్లో చేపట్టాల్సిన బిజినెస్ పైన చర్చ సాగింది. అధికార పక్షం నుండి అయిదు బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా చర్చించటానికి సిద్దంగా ఉన్నామని..సరైన ఫార్మాట్ లో వస్తే ఏ చర్చ కైనా తాము సిద్దమని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక, సీఎం జగన్..టీడీపీ నేత అచ్చెన్న మధ్య ఆసక్తి కర సంభాషణ చోటు చేసుకుంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలినాడే రచ్చ ... విద్యుత్ ఒప్పందాలపై మాటల యుద్ధంఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలినాడే రచ్చ ... విద్యుత్ ఒప్పందాలపై మాటల యుద్ధం

అచ్చెన్నా..గాయం తగ్గిందా..
బీఏసీ సమావేశానికి వచ్చిన టీడీపీ ఉప నేతను ముఖ్యమంత్రి జగన్ పలకరించారు. చేతికి గాయం తగ్గిందా..ప్రమాదం ఎలా జరిగింది అంటూ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు సైతం ప్రమాదం జరిగిన తీరును వివరించారు. కారు డివైడర్ ను ఢీకొట్టిందని.. ఆ సమయంలో డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించటంతో ప్రమాదం తప్పిందని వివరించారు. దీంతో..సమావేశం ముగిసన తరువాత ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మరోసారి అచ్చెన్నతో మా ముఖ్యమంత్రి చూసావా అన్నా..ఎంత ప్రేమగా పలకరించారో..అది మా సీఎం అందరిమీద చూపించే ప్రేమ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి అచ్చెన్నాయుడు సైతం సానుకూలంగా స్పందించి..రాజకీయాల్లో పార్టీలో వేరు..తప్ప మన మధ్య ఏముంటుందంటూ సమాధానం ఇచ్చారు.

BAC decided to conduct AP Assembly winter sessions up to 17th of this month

7రోజులు..20 అంశాలకు పైగా
సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని సమావేశంలో టీడీపీ డిమాండ్ చేసింది. అయితే, ప్రభుత్వం తొలుత 9 రోజుల పాటు నిర్వహణకు మొగ్గు చూపింది. అయితే, అజెండా అంశం పైన చర్చ ప్రారంభమైన తరువాత రెండు పార్టీల నుండి ప్రస్తావించే అంశాలు దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఏడు రోజుల సమయం చాలనే నిర్ణయానికి వచ్చారు. మొత్తం 20 అంశాల పైన ఈ ఏడు రోజుల సమయం లో చర్చ చేపట్టనున్నారు. ప్రతీ రోజు ప్రశ్నోత్తరాలు పూర్తయిన తరువాత చర్చలు సాగాలని..ప్రశ్నోత్తరాలకు మాత్రం ఇబ్బందుల లేకుండా చూసుకోవాలని నిర్ణయించారు. తొలి రోజు ఏపీలో మహిళల భధత్ర పైన స్వల్ప కాలిక చర్చ మొదలైంది. అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలతో పాటుగా..ప్రతిపక్షం లేవనెత్తిన రాజధాని..పోలవరం..నిత్యావసరాలు..పెట్టుబడులు..పరిశ్రమల వంటి అంశాల పైన చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

English summary
BAC decided to conduct Assembly winter sessions up to 17th of this month. Total seven days with five govt bill business decided in meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X