వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైవీ సుబ్బారెడ్డి హిందువు కాదంటూ దుమారం .. స్పందించిన వైవీ ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

టీటీడీ బోర్డు చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వనున్నారు అన్న వార్తల నేపధ్యంలో ఆయనపై దుమారానికి తెరలేచింది. వైవీ సుబ్బారెడ్డి మతం విషయంలో దుష్ప్రచారాన్ని సాగించి ఆయన నియామకాన్ని వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. ఇందుకోసం సోషల్ మీడియాను తెగ వాడుతున్నవారు ఏకంగా వికీపీడియాలో సైతం మార్పులు చేసేశారు.

<strong>పార్టీ ఓటమి , స్థానిక సంస్థల ఎన్నికలపై నేటి నుండి జనసేన సమీక్షలు .. పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ?</strong>పార్టీ ఓటమి , స్థానిక సంస్థల ఎన్నికలపై నేటి నుండి జనసేన సమీక్షలు .. పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ?

 జగన్ బాబాయి వై వీ సుబ్బారెడ్డి మతంపై దుమారం .. టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వనున్నందుకే

జగన్ బాబాయి వై వీ సుబ్బారెడ్డి మతంపై దుమారం .. టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వనున్నందుకే

జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి జగన్ టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇవ్వనున్న నేపధ్యంలో ఆయన హిందువు కాదని ఆయన క్రిస్టియానిటీని స్వీకరించారని ప్రచారం జోరుగా సాగింది . అలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం ఏమిటంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే లేచింది . అంతటితో ఆగకుండా వైవీ సుబ్బారెడ్డి వికీపీడియా పేజ్ లోకి వెళ్లి మరీ ఆయన మతం క్రిస్టియన్ అంటూ ఎడిట్ చేసేశారు . ఇక ఇలా టీటీడీ బోర్డు చైర్మన్ గా అనర్హుడు అన్న వివాదాన్ని సృష్టించాలని చాలా ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశంలో వాస్తవాలు వేరేలా ఉన్నాయి. వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ మతం తీసుకోలేదు . ఆయన పుట్టింది హిందువుగానే కొనసాగుతున్నది హిందూయిజంలోనే. సుబ్బారెడ్డి భార్య కూడా పుట్టుకతోనే హిందువు . మతంమార్పిడిలు గట్రా కూడా వారి కుటుంబంలో లేవని తెలుస్తోంది. కానీ సుబ్బారెడ్డి మతాన్నే వివాదం చెయ్యాలని చూడటం కేవలం సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ గా అవకాశం రాకుండా ఉండటం కోసమేనని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది.

తనపై జరిగిన దుష్ప్రచారాన్ని ఖండించిన వైవీ సుబ్బా రెడ్డి .. తానూ హిందువునని ప్రకటన

తనపై జరిగిన దుష్ప్రచారాన్ని ఖండించిన వైవీ సుబ్బా రెడ్డి .. తానూ హిందువునని ప్రకటన

ఒక పక్క ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వైవీ సుబ్బా రెడ్డి కి టీటీడీ చైర్మన్ పదవి దాదాపు ఖరారు చేశారు . ఇక ఈ నేపధ్యంలో చెలరేగిన దుమారమపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తాను హిందువు కాదన్న వార్తలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఇక తనమీద కావాలని కొందరు పనిగట్టుకుని ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు . వాటిని ఎవరూ నమ్మకండని వైవీ సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. తాను హిందువునేనని.. తిరుమల శ్రీనివాసుడు మా ఇష్టదైవం అని వైవీ సుబ్బా రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్‌గా ఉండాలని జగన్ తనను ఆదేశించారని ఆయన చెప్పారు. అలాగే దేవుడికి సేవ చేసే భాగ్యం ఈ అవకాశం ద్వారా కలిగిందని అనుకుంటున్నానని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి తనకు ఎలాంటి బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానన్నారు జగన్ బాబాయి వైవీ సుబ్బా రెడ్డి .

టీటీడీ చైర్మన్ గా స్వామీ వారి ఆస్తులు , ఆభరణాల విషయంలో లోగుట్టు వెలికి తీస్తా అంటున్న వై వీ సుబ్బా రెడ్డి

టీటీడీ చైర్మన్ గా స్వామీ వారి ఆస్తులు , ఆభరణాల విషయంలో లోగుట్టు వెలికి తీస్తా అంటున్న వై వీ సుబ్బా రెడ్డి

అంతే కాదు ఈ నేపధ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ,టీటీడీలో స్వామీ వారి ఆస్తులు, ఆభరణాల విషయంలో జరిగిన అవకతవకలపై వాస్తవాలు ప్రజలకు తెలిసేలా చేస్తానని చెప్పిన ఆయన తనకు శ్రీవారి సేవ చేసుకునే అదృష్టం కలగటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

English summary
Ever since the reports of YV Subba Reddy being the strong contender for TTD Chairman surfaced, Bad Propaganda has begun on YS Jaganmohan Reddy's Uncle projecting him as a Christian with the intention to make his appointment controversial. This false campaign isn't restricted to Social Media alone, but spread to Wikipedia as well. Some people with vested interests edited the Wikipedia Page to make people believe that YV has been embracing Christianity.Actually, Neither YV Subba Reddy nor his Wife got converted into christians. They were born-Hindus and continued to remain the same way. YV Subbareddy condemned the propaganda about his religion . He said the Chief Minister Jagan Mohan Reddy would maintain his trust in him and said he would make the facts about the Swamy's assets and jewelery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X