వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతమనేనికి బెయిల్ మంజూరు... శనివారం విడుదల

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరైంది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న చింతమనేనికి జిల్లా కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

చింతమనేనిపై పాత కేసులు

చింతమనేనిపై పాత కేసులు

చింతమనేని పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇలా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై మొత్తం నలబై కేసులు ఆయనపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. వీటిలో ముఖ్యంగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అరోపణలతో పాటు, అధికారులపై దాడులు చేయడం లాంటీవి ముఖ్యంగా ఉన్నాయి. ఇలా అయనపై సుమారు నలబై కేసులు నమోదు కాగా వాటన్నింటిని తిరగదోడేందుకు ఏపీ పోలీసులు సన్నద్దమయ్యారు. దీంతోపాటు తాజాగా కొంతమంది యువకులపై చింతమనేని దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

అజ్జాతంలో చింతమనేని

అజ్జాతంలో చింతమనేని

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నమోదైన పలు కేసులను పోలీసులు తిరగదోడడంతో పాటు పలు కొత్త కేసులు ఆయనపై నమోదయ్యాయి. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. దీంతో అరెస్ట్ ‌నుండి తప్పించుకునేందుకు పదిరోజుల పాటు అజ్జాతంలోకి వెళ్లారు. అయితే.... చింతమనేని భార్యకు అనారోగ్యంగా ఉండడంతో పాటు పోలీసుల ఒత్తిడితో ఎస్పీ ఎదుట లొంగిపోవడానికి రావడంతో ..... దుగ్గిరాలలోని తన నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. దీంతో చింతమనేని ప్రభుత్వ విధానాలపై ఫైర్ అయ్యారు. ప్రజా పోరాటాలతో బయటకు వస్తుంటే..సహించలేకనే... అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి కేసులకు భయపడేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.

అరెస్ట్ సమయంలో హైడ్రామా ..

అరెస్ట్ సమయంలో హైడ్రామా ..

సెప్టెంబర్ 11న చింతమనేనిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. కాగా అంతకు ముందు ఆయనపై సుమారు పదికేసుల వరకు నమోదు చేశారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయన్న అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఆయన భార్య అనారోగ్యం క్షీణించడంతో అజ్ఝాతం నుండి బయటకు వచ్చి లొంగిపోయోందుకు తిరిగి దెందులూరులోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే అంతకు మందే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లోని భార్య పిల్లలతో మాట్లాడిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు. అరెస్ట్ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. చింతమనేని అరెస్ట్ చేయకుండా పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతవరణ ఏర్పడింది.

English summary
Bail has been sanctioned to former mla chintamaneni prabhakar by district court on friday. he may be released on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X