హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్యాగానికి ప్రతీక బక్రీద్, ముందే ఇలా సందడి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ మొదటిది కాగా, రెండోది బక్రీద్ ఈ పండుగకు ఈదుల్..అజహా, ఈదుజ్జహా అని కూడా పిలుస్తారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు నిర్వహించుకుంటారు. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సివుంటుంది. ఈ నెల ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు.

హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్..ఉల్..హరామ్‌లోవున్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.

Bakrid stands for sacrifice

హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (ముహమ్మద్ (సొ.అ.స) ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం (సొ.అ.స) తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

English summary

 An important festival of Muslims Bakrid stands for sacrifice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X