వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాల‌కృష్ణ అక్క‌డి నుండే : జేసి బ్ర‌దర్స్ దూరం : ప‌రిటాల శ్రీరాం కు అవకాశం లేన‌ట్లే..!

|
Google Oneindia TeluguNews

మ‌రి కొద్ది రోజుల్లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లాలోని టిడిపి అభ్య‌ర్దుల‌ను ముఖ్య‌మంత్రి ఖ‌రారు చేసారు. ఆర్ద‌రాత్రి వ‌ర‌కు జ‌రిగిన స‌మావేశంలో అధిక స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేసారు. సినీ హీరో బాల‌కృష్ణ కు మ‌రోసారి హిందూపూర్ నుండి బ‌రిలోకి దిగాల‌ని సూచించారు. ఇక, ఈ ఎన్నిక‌ల్లో జేసి బ్ర‌ద‌ర్స్ దూరంగా ఉంటున్నారు.

బాల‌కృష్ణ కే హిందూపురం..

బాల‌కృష్ణ కే హిందూపురం..

గ‌త ఎన్నిక‌ల్లో హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేసి గెలిచిన నందూమ‌రి బాల‌కృష్ణ మ‌రోసారి అదే నియో జ‌క‌వ‌ర్గం నుండి తిరిగి పోటీ చేయ‌నున్నారు. అయ‌నకు తిరిగి టిక్కెట్ ఇస్తారా లేదా అనే చ‌ర్చ కొంత కాలంగా సాగు తోంది. హిందూపూర్ నియోజ‌క‌వ‌ర్గం తొలి నుండి టిడిపికి కంచుకోట‌గా ఉంది. టిడిపి ఆవిర్భావం త‌రువాత ఇప్ప‌టి వ ర‌కు అక్క‌డ మ‌రో పార్టీ గెల‌వ‌లేదు. అయితే, బాల‌కృష్ణ పై స్థానికంగా కొన్ని సంద‌ర్భాల్లో నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. అదే స‌మ‌యంలో అక్క‌డి నుండి లోకేష్ కు అవ‌కాశం ఇచ్చి బాల‌కృష్ణ ను మ‌రో స్థానం ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు బాల‌కృష్ణ కే తిరిగి సీటు ఖ‌రారు చేసారు. ఇక‌, వైసిపి లో మాత్రం ఇక్క‌డి టిడిపి నుండి వైసిపి లో చేరిన అబ్దుల్ గ‌ని..గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఓడిన న‌వీన్ నిశ్చ‌ల్ మ‌ధ్య సీటు కోసం పోరు న‌డుస్తోంది.

పోటీకి జేసి బ్ర‌ద‌ర్స్ దూరం..

పోటీకి జేసి బ్ర‌ద‌ర్స్ దూరం..

ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విధంగా జేసి బ్ర‌ద‌ర్స్ ఈ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. వారి కుమారుల‌కు సీట్లు కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. అనంత‌పురం లోక్‌స‌భ నుండి జేసి దివాక‌ర‌రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్, తాడిప‌త్రి నుండి ప్ర‌భాక‌ర రెడ్డి త‌న‌యుడు అస్మిత్ రెడ్డి బ‌రిలోకి దిగ‌టానికి పార్టీ అధినేత ఆమోద ముద్ర వేసారు. అయితే, అనంత‌పురం లోక్‌స‌భ ప‌రిధిలోని నాలుగు స్థానాల్లో అభ్య‌ర్ధుల‌ను మారిస్తేనే తాను ఎన్నిక‌ల బరిలోకి దిగుతాన‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించా రు. అయినా, టిడిపి అధినేత మాత్రం వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. అనంతపురం అర్బ‌న్ ను తిరిగి ప్ర‌భాక‌ర్ చౌద‌రి కి కేటాయిస్తూ నిర్ణ‌యించారు. క‌ద‌రి నుండి గ‌త ఎన్నిక‌ల్లో వైసిపి నుండి గెలిచి టిడిపిలో చేరిన చాంద్ భాషా విష‌యం లో నిర్ణ‌యం తీసుకోలేదు. అదే విధంగా అసంతృప్తులు చెల‌రేగుతున్న క‌ళ్యాణ‌దుర్గం, పుట్ట‌ప‌ర్తి స్థానాల‌ను పెండింగ్
లో పెట్టారు. జిల్లాలోని ఇద్ద‌రు మంత్రులు తిరిగి వారి స్థానాల నుండే పోటీ చేయ‌నున్నారు. సిట్టింగ్ ల్లో శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే యామినీ బాల‌కు సీటు నిరాక‌రించారు.

ప‌రిటాల శ్రీరాం కు నో ఛాన్స్..

ప‌రిటాల శ్రీరాం కు నో ఛాన్స్..

ఈ సారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా పోటీ చేయాల‌ని ప‌రిటాల త‌న‌యుడు శ్రీరాం భావించారు. ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రిని కోరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. శ్రీరాంకు పెనుగొండ లేదా హిందూపూర్ లోక్‌స‌భ ఇవ్వాల‌నే దాని పైనా చ‌ర్చ జ‌రిగింది. అయితే, ఈ సారి ఎన్నిక‌లు కీల‌కం కావ‌టంతో వార‌సుల‌కు టిక్కెట్లు ఇవ్వ‌టం లేద‌ని..సీనియ‌ర్లే పోటీకి దిగాల‌ని ముఖ్య‌మంత్రి తేల్చి చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే, జేసి బ్ర‌ద‌ర్స్ పోటీ నుండి త‌ప్పుకోవటంతో వారి స్థానా ల్లో వార‌సుల‌కు అవ‌కాశం ఇచ్చారు. అనేక మంత్రి సీనియ‌ర్లు త‌మ వార‌సుల‌కు టిక్కెట్లు ఇవ్వాల‌ని అభ్య‌ర్ధించినా సీయం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం లేదు. ఒక‌టి రెండు చోట్ల మిన‌హా మ‌రెక్క‌డా కొత్త‌గా వార‌సుల‌కు అవ‌కాశం ఇవ్వ‌టం లేద‌ని స్ప‌ష్టం చేసారు. దీంతో..శ్రీరాం వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, అనంత‌పురం లోక్‌స‌భ‌కు జేసి ప‌వ‌న్‌, హిందూపూర్ లోక్‌స‌భ స్థానానికి నిమ్మ‌ల కిష్ట‌ప్ప ను ఖ‌రారు చేసారు.

English summary
TDP Chief announced party candidates for Anantapur Loksabha and majority Assembly segments. He given chance for JC brothers sons in place of them. Babu confirmed ticket for Balakrishna for Hindupur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X