ఈ వెధవలను క్షమించేద్దాం: దొరికితే దవడ పగిలిపోద్ది: వారికి బాలయ్య కోటింగ్: చిరంజీవితో రిలేషన్‌పై
అమరావతి: ప్రముఖ నటుడు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో ఆయన కామెంట్స్ సరికొత్త డిబేట్స్‌కు దారి తీస్తోన్నాయి. ఇదవరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు కన్నుమూతపై ఆయన చేసిన ప్రకటనలు వివాదాస్పదం అయ్యాయి. రాజకీయ దుమారానికి దారి తీశాయి.

ఆ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు..
ఆ
తరువాత
కూడా
అధికార
వైఎస్ఆర్
కాంగ్రెస్
పార్టీని
ఉద్దేశించి
పరోక్షంగా
చురకలు
అంటించారు.
అవి
వివాదాలకు
కేంద్రబిందువు
అయ్యాయి.
ఎన్టీ
రామారావు
గుండెపోటుతో
కన్నుమూశారని,
వెన్నుపోటు
వల్ల
కాదంటూ
ఆయన
ఇచ్చిన
వివరణపై
సోషల్
మీడియాలో
భిన్నాభిప్రాయాలు
వ్యక్తం
అయ్యాయి.
బాలకృష్ణ
చేసిన
వ్యాఖ్యలను
వైఎస్ఆర్సీపీ
సానుభూతిపరులు
తప్పు
పట్టిన
విషయం
తెలిసిందే.
ఎన్టీ
రామారావు
స్వయంగా
చేసిన
ప్రకటనలకు
సంబంధించిన
వీడియో
క్లిప్పింగులను
జోడించి
మరీ..
బాలకృష్ణపై
ఘాటు
విమర్శలు
చేశారు.

ఎవరినడిగినా చెబుతారంటూ..
చంద్రబాబు నాయుడు తనను పదవీచ్యుతుడిని చేయడం పట్ల ఎన్టీ రామారావు అప్పట్లో తన కుమారుల వైఖరిని కూడా తప్పుపట్టారని సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు. తండ్రిలాంటి మామకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడంటూ స్వయంగా ఎన్టీ రామారావే ఈ విషయాన్ని చెప్పారని వైసీపీ సోషల్ మీడియా అభిమానులు స్పష్టం చేశారు. చంద్రబాబు.. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి గద్దె దించాడని ఈ రాష్ట్రంలో ఏ చెట్టును, పుట్టను అడిగినా చెపుతాయని, అది నందమూరి కుటుంబానికి తెలియకపోవడం వింతేనంటూ కామెంట్స్ చేశారు.

దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాలయ్య..
అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి ఈ కామెంట్స్. దీనితో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య స్నేహ సంబంధాలు ఉండవంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్నీ బాలకృష్ణ తప్పు పట్టారు. తాను ఎవరితోనూ సఖ్యతగా ఉండననేది తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. నెటిజన్ల మీద తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. వారిని వెధవలుగా అభివర్ణించారు. తాను ఏది అనుకుంటే.. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్నారంటూ మండిపడ్డారు. నటుల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండవని పోస్టులు చేస్తోన్నారని.. అలాంటి వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. దొరికితే దవడ పగిలిపోద్ది.. అంటూ హెచ్చరించారు.

లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయింది.. దొరికితే దవడ పగిలిపోద్దీ
ఇవ్వాళ
ప్రతివాడూ
తనకు
ఏది
అనిపిస్తే
అది
సోషల్
మీడియాలో
పోస్ట్
చేస్తోన్నాడని
విమర్శించారు.
పేరు
లేని,
లొకేషన్
తెలియని,
అడ్రసులతో
బాధ్యతారాహిత్యంగా
ప్రవర్తిస్తున్నారంటూ
బాలయ్య
తప్పుపట్టారు.
రవితేజకు
బాలకృష్ణకు
పడదు..
చిరంజీవి-బాలకృష్ణ
ఫోనులో
మాట్లాడుకోరు.
నా
హీరో
తోపు..
నీ
హీరో
సోపు..
ఏంటివన్నీ..
అంటూ
అసహనాన్ని
వ్యక్తం
చేశారు.
ఇప్పుడు
తన
లెఫ్ట్
హ్యాండ్
కూడా
రెడీ
అయిందని..
దొరికితే
దవడ
పగిలిపోద్ది
అంటూ
హెచ్చరించారు.

ఈ వెధవలను క్షమించేద్దాం..
ఊరు, పేరు చెప్పుకోలేని.. ధైర్యం లేని ఈ వెధవలను క్షమించేద్దామని బాలకృష్ణ కొందరు నెటిజన్ల గురించి చెప్పుకొచ్చారు. మన మీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడు మనం అన్‌స్టాపబుల్ అవుతాం.. అంటూ ముక్తాయింపునిచ్చారు. తన కొత్త ఎపిసోడ్ ప్రొమో సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారాయి. గతంలో ఎన్టీ రామారావు కన్నుమూత పట్ల వ్యక్తమైన భిన్నాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తాజాగా విమర్శలు గుప్పించాని అంటున్నారు.