వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో చెయ్యాలా?: వపన్ వ్యాఖ్యలపై బాలయ్య, ‘అలా చేస్తే బాబు గ్రాఫ్ పడిపోతుంది’

|
Google Oneindia TeluguNews

Recommended Video

బాలయ్య పవన్ ని అంత మాట అన్నాడా?

అనంతపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేతలు కూడా అదే స్థాయిల్ పవన్‌ను ఏకిపారేస్తున్నారు.

కేసుల మాఫీ! జగన్ పార్టీని ఎవరూ నమ్మడం లేదు: మహాకుట్ర అంటూ బాబు సంచలనంకేసుల మాఫీ! జగన్ పార్టీని ఎవరూ నమ్మడం లేదు: మహాకుట్ర అంటూ బాబు సంచలనం

అయితే, పవన్ వ్యాఖ్యలపై ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం స్పందించలేదు. బాలకృష్ణ శనివారం హిందూపురంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఏదీ ముఖ్యం కాదు! చివరకు బాబూ దిగిరాక తప్పలేదు: తేల్చి చెప్పిన జగన్ఏదీ ముఖ్యం కాదు! చివరకు బాబూ దిగిరాక తప్పలేదు: తేల్చి చెప్పిన జగన్

నేనే సూపర్ హీరో

నేనే సూపర్ హీరో

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా.. బాలకృష్ణ అందుకు నిరాకరించారు. ‘ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు.. నేనే సూపర్ హీరో' అని అన్నారు. గతంలోనూ పవన్ గురించి స్పందించమని అడిగితే బాలయ్య ఇదే విధంగా సమాధానమివ్వడం గమనార్హం.

బాబు మంచి పని చేశారు

బాబు మంచి పని చేశారు

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడం ఏపీ రాజకీయాల్లో మంచి పరిణామమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తాయని చెప్పారు. అవిశ్వాసం చంద్రబాబుకు పెద్ద పరీక్ష అని... ఆయన పట్టుదలగా వ్యవహరిస్తే అవిశ్వాసంపై చర్చ సాధ్యమేనని అన్నారు.

అలా చేస్తే బాబు గ్రాఫ్ పడిపోతుంది

అలా చేస్తే బాబు గ్రాఫ్ పడిపోతుంది

పార్లమెంటులో అవిశ్వాసంపై చర్చ జరగకపోతే... చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుందని చెప్పారు. తనకున్న ఇమేజ్‌ను ఉపయోగించుకోవడానికి చంద్రబాబుకు ఇదే సరైన సమయమని ఉండవల్లి అన్నారు. అవిశ్వాసాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా... ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పారు.

పవన్ వల్లే బాబు..

పవన్ వల్లే బాబు..

వాస్తవానికి జనసేన అధినేత పవన్ వల్లే టీడీపీ అవిశ్వాసం పెట్టిందని ఉండవల్లి తెలిపారు. బీజేపీతో పవన్ కుమ్మక్కయ్యారనేది అవాస్తవమని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పవన్ నిరాహారదీక్ష చేపడితే... మంచి ప్రచారం వస్తుందని తెలిపారు.

పవన్.. విశ్వాసాన్ని కోల్పోయారు.

పవన్.. విశ్వాసాన్ని కోల్పోయారు.

జనసేన అధినేత పవన్‌పై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ను ఏపీ ప్రజలు నమ్మడం లేదని అన్నారు. మొన్నటిదాకా టీడీపీ, మంత్రి నారా లోకేష్‌పై ఒక్క మాట కూడా అనన్న పవన్... ఎవరో చెబితే, ఇప్పుడు లోకేష్‌పై విమర్శలు చేస్తున్నారని... ఇలాంటి వైఖరి వల్లే ఆయన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు.

పవన్ యూటర్న్.. బీజేపీకి కాంగ్రెస్ గతే

పవన్ యూటర్న్.. బీజేపీకి కాంగ్రెస్ గతే

ఊహించని విధంగా పవన్ తీసుకున్న యూటర్న్ ను చూసి జనసేన కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని రామ్మోహన్ అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా... రాష్ట్రాన్ని సమర్థవంతంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పాలిస్తున్నారని చెప్పారు. విభజన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు.

English summary
Hindupur MLA and Tollywood Hero Nandamuri Balakrishna did not responded on Janasena chief Pawan Kalyan comments on chandrababu and lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X