వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాపుకు నివాళి: ఏడ్చిన బాలకృష్ణ, వీఐపీలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ దర్శకుడు బాపు మృతదేహాన్ని సందర్సించి, నివాళులు అర్పించడానికి సినీ ప్రముఖులతో పాటు ఇతర ప్రముఖులు హైదరాబాదు నుంచి తరలి వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ ఆయన మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. పలు రంగాల ప్రముఖులు బాపు పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.

బాపు చివరి సినిమా శ్రీరామరాజ్యంలో నటించిన బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. కళ్లు చెమ్మగిల్లిన స్థితిలో ఆయన కాసేపు బాపు మృతదేహం వద్ద నించుండిపోయారు. పెళ్లిపుస్తకం హీరోయిన్ దివ్యవాణి బాపు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాసేపు బాపు పార్ధివ దేహం వద్ద కూర్చుండిపోయారు.

సినీ ప్రముఖులు చిరంజీవి, శరత్ బాబు, కె. రాఘవేంద్ర రావు, సింగీతం శ్రీనివాస రావు, ముత్యాలముగ్గు హీరోయిన్ సంగీత, శంకరాభరణం రాజ్యలక్ష్మి, ప్రభ తదితరులు బాపుకు నివాళులు అర్పించారు. బాపు చివరి దశలో చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేస్తామని రఘురామ కృష్ణం రాజు చెప్పారు. బాపు కుమారుడు వేణుగోపాల్ సోమవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు

కంటతడి పెట్టిన బాలయ్య

కంటతడి పెట్టిన బాలయ్య

బాపు చివరి సినిమా శ్రీరామరాజ్యంలో నటించిన నందమూరి హీరో బాలకృష్ణ బాపు మృతదేహానికి నివాళులు అర్పించి కంట తడి పెట్టారు.

బాలయ్య ఇలా...

బాలయ్య ఇలా...

బాలకృష్ణ బాపు మృతదేహం వద్ద ఉద్వేగాన్ని నిలువరించుకోలేకపోయారు. కాసేపు పార్ధివ దేహం వద్ద నించుండి ఏడ్చేశారు.

జీర్ణించుకోలేకపోతున్నా...

జీర్ణించుకోలేకపోతున్నా...

బాపు మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, ఎన్నో ప్రభంజనాలు సృష్టించిన బాపు ఆఖరి చిత్రం శ్రీరామరాజ్యంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని బాలయ్య అన్నారు.

చిరంజీవి నివాళి

చిరంజీవి నివాళి

బాపు పార్ధివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. బాపు దర్శకత్వం వహించిన మంత్రిగారి వియ్యంకుడు, మనవూరి పాండవులు చిత్రంలో చిరంజీవి నటించారు.

అందమైన అనుభవాలు...

అందమైన అనుభవాలు...

బాపుతో తనకు ఎన్నో అందమైన అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి అన్నారు.

నాకు శిక్షణ ఇచ్చాయి..

నాకు శిక్షణ ఇచ్చాయి..

తాను నటించిన బాపు సినిమాలు మంత్రిగారి వియ్యంకుడు, మనవూరి పాండవులు తనకు ఓ రకంగా శిక్షణ ఇచ్చాయని చిరంజీవి చెప్పుకున్నారు.

సింగీతం శ్రీనివాసరావు

సింగీతం శ్రీనివాసరావు

బాపు పార్ధివ దేహానికి ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు నివాళులు అర్పించారు. బాపు భౌతిక కాయంపై ఆయన పూలమాల వేశారు.

బాపు కుమారుడితో బాలు...

బాపు కుమారుడితో బాలు...

బాపు కుమారుడు వేణుగోపాల్ రావును ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓదారుస్తూ ఇలా కనిపించారు.

బాపు భౌతిక కాయం వద్ద...

బాపు భౌతిక కాయం వద్ద...

బాపు భౌతిక కాయానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నివాళులు అర్పిచారు. గత నాలుగైదేళ్లుగా తాను బాపుకు దగ్గరయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

శేఖర్ కమ్ముల నివాళి

శేఖర్ కమ్ముల నివాళి

బాపు మృతదేహానికి ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల నివాళులు అర్పించారు. తెలుగు సినీ ప్రపంచం బాపు మృతికి శోకసముద్రమైంది.

భానుచందర్ నివాళి

భానుచందర్ నివాళి

ప్రముఖ దర్శకుడు బాపు మృతదేహానికి ప్రముఖ సినీ నటుడు భానుచందర్ నివాళులు అర్పించారు. సినీ ప్రపంచం బాపుకు తుది వీడ్కోలు ఇవ్వడానికి తరలి వచ్చింది.

శైలజ, సుధాకర్ నివాళి

శైలజ, సుధాకర్ నివాళి

బాపు పార్ధివ దేహాన్ని ప్రముఖ గాయని శైలజ, నటుడు సుధాకర్ దంపతులు సందర్శించి, నివాళులు అర్పించారు.

English summary
Telugu film fraternity paid tribute to director Bapu in Chennai. Balakrishna and Divyawani shed tears at Bapu's dead body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X