బుల్లెట్‌పై బాలయ్య.. : హిందూపురంలో పాదయాత్ర..

జనచైతన్య యాత్రలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన బాల‌కృష్ణ.. బుల్లెట్ బైక్ తో రోడ్డెక్కారు.

హిందూపురం: టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. జనచైతన్య యాత్రలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. బుల్లెట్ బైక్ తో రోడ్డెక్కారు. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ.. నగరంలో సందడి చేశారు.

Balakrishna padayatra in hindupuram

అనంతరం నగరంలో పాదయాత్ర చేశారు బాల‌కృష్ణ. పాదయాత్ర పొడుగునా.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. హంద్రీనివా సుజల స్రవంతి పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్బంగా అక్కడి ప్రజలకు హామి ఇచ్చారు.

హంద్రీనివా పూర్తి చేసి.. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి అనంతపురం వ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటిని నింపుతామని, హిందూపురం పట్టణానికి తాగునీరు వచ్చేలా చేస్తామని బాల‌కృష్ణ భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+