సమర్థుడు, ఎన్టీఆర్ బాటలో: చంద్రబాబుపై బాలకృష్ణ ప్రశంసలు(పిక్చర్స్)
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగల నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేనని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ కితాబిచ్చారు. మహిళలు తమ పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు. టిడిపిని నమ్మి ఓటేసిన వారికి అండగా ఉంటామని చెప్పారు.
విశాఖపట్నంలో శుక్రవారం ‘డిక్టేటర్' విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఓ థియేటర్‌కు విచ్చేసి సందడి చేశారు. ఆ తర్వాత విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ.. భూమిని స్ర్తీతో పోల్చుతారని, స్ర్తీ లేకపోతే సృష్టే లేదన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆర్థిక స్వావలంబన సాధించాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. తమ కాళ్ల మీద తాము నిలబడాలని పిలుపునిచ్చారు.
మహిళల కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. శుక్రవారం అమ్మవారి రోజని, అటువంటి రోజున సీమంతం చేయడం శుభసూచకమన్నారు. గర్భిణులు నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా ఆస్పత్రికి వెళ్లాలన్నారు.

బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగల నేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ కితాబిచ్చారు.

బాలకృష్ణ
మహిళలు తమ పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు. టిడిపిని నమ్మి ఓటేసిన వారికి అండగా ఉంటామని చెప్పారు.

బాలకృష్ణ
విశాఖపట్నంలో శుక్రవారం ‘డిక్టేటర్' విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఓ థియేటర్‌కు విచ్చేసి సందడి చేశారు.

బాలకృష్ణ
ఆ తర్వాత విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ.. భూమిని స్ర్తీతో పోల్చుతారని, స్ర్తీ లేకపోతే సృష్టే లేదన్నారు.

బాలకృష్ణ
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆర్థిక స్వావలంబన సాధించాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. తమ కాళ్ల మీద తాము నిలబడాలని పిలుపునిచ్చారు.

బాలకృష్ణ
మహిళల కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు.

బాలకృష్ణ
శుక్రవారం అమ్మవారి రోజని, అటువంటి రోజున సీమంతం చేయడం శుభసూచకమన్నారు. గర్భిణులు నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా ఆస్పత్రికి వెళ్లాలన్నారు.

బాలకృష్ణ
బాలకృష్ణ, దర్శకుడు శ్రీవాస్, రచయిత శ్రీధర్‌లను మంత్రి అయ్యన్న, వెలగపూడి సన్మానించారు.












Click it and Unblock the Notifications