India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Balakrishna Press Meet: ఖబడ్దార్.. గాజులు తొడుక్కోలేదు : మరో అవతారం చూస్తారు : బాలయ్య హెచ్చరిక..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఇళ్లల్లోని మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే చేతులు ముడుచుకొని కూర్చోలేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. వీళ్లు మారాలని..మారకపోతే మెడలు వంచి మారుస్తామంటూ వ్యాఖ్యానించారు. పరిణామాలు బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేసారు. సజావుగా జరగాల్సిన అసెంబ్లీ, దారుణంగా ప్రవర్తించారు. చాలా ధైర్యంగా ఉండే చంద్రబాబు లాంటి మనిషి.. కన్నీరు పెట్టుకున్నారని బాలయ్య చెప్పుకొచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎంతో డెవలప్ చేసారని చెప్పారు. దేని కైనా హద్దు ఉంటుందని..ఇక నోరు తెరిస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేసారు.

మిమ్మల్ని మీరు కాపాడుకోండంటూ బలయ్య హెచ్చరించారు. ఎన్టీఆర్ వారసుల మరో అవతారం చూడాల్సి ఉంటుందని భువనేశ్వరి సోదరి వార్నింగ్ ఇచ్చారు. నందమూరి రామక్రిష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. ఓరేయ్ కొడాలి నాని.. వంశీ..అంబటి రాంబాబు.. ద్వారంపూడి జాగ్రత్తగా ఉండాలని నందమూరి రామక్రిష్ణ హెచ్చరించారు.

భువనేశ్వరి పైన మాట్లాడుతారా

భువనేశ్వరి పైన మాట్లాడుతారా

అంశాల మీద మాట్లాడుతాం..వారికి సూచనలు ఇవ్వటం..నిలదీయం జరిగేది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మహిళా ప్రతినిధులు సైతం అసెంబ్లీలో ఉన్నారు. సవాళ్లు - ప్రతి సవాళ్లు సహజం. వ్యక్తిగత అజెండాతో మాట్లాడటం సరి కాదు.

ఎవరి గరించి మాట్లాడని సంస్కారం మనది. మా సోదరి భువనేశ్వరి పైన వ్యక్తిగతంగా మాట్లాడటం సరి కాదుని బాలయ్య చెప్పారు. వారి భాష..వ్యాఖ్యలు బాధాకరమని చెప్పుకొచ్చారు.. గొడ్ల చావిడిలో ఉన్నామా..అసెంబ్లీలో ఉన్నామా అన్నట్లుగా ఉంది. చంద్రబాబు మీద మాట్లాడచ్చు. వ్యక్తి గతంగా రాజకీయంగా సంబంధం లేని మహిళ పైన మాట్లాడారని ఫైర్ అయ్యారు.

చేతులు ముడుచుకొని కూర్చోలేం

చేతులు ముడుచుకొని కూర్చోలేం

దోచుకోవటం తప్ప.. భువనేశ్వరి చేసే సామాజిక సేవ వాళ్లు చేసారా. వాళ్ల ఇంట్లో మహిళలు కూడా వారిని అసహ్యించుకుంటున్నారు. ఆడవాళ్ల జోలికి వస్తే చేతులు ముడుచుకొని కూర్చోం. వాళ్ల ఇంట్లోని అంశాన్ని దారి తప్పించేందుకు ఇటువంటి భాష వినియోగిస్తారా అని ప్రశ్నించారు.

చదువుకున్న వాళ్లు సైతం అక్కడ సభ్యులుగా ఉన్నా..వారు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సభాపతి ఏం చేస్తున్నారో అర్దం కావటం లేదని బాలయ్య వ్యాఖ్యానించారు. మైండ్ గేమ్ ఆడుతున్నామని మీరు అనుకుంటున్నారు..రేపు మేము ఉండవచ్చంటూ బాలయ్య వ్యాఖ్యానించారు.

ఏ వ్యవస్థలు అడ్డుకోలేవు

చంద్రబాబు ఆర్దికంగా ఏపీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు అమలు చేసారన్నారు. చంద్రబాబు ముందు చూపు ఉన్న నాయకుడిగా పేర్కొన్నారు. మెజార్టీ ఉంది కదా అని మాట్లాడితే సహించేది లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని...చంద్రబాబు అనుమతి కూడా ఇక తమకు అవసరం లేదని..చూస్తూ ఊరుకొనేది లేదని బాలయ్య తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తలు..అభిమానులు..నందమూరి కుటుంబం నుంచి హెచ్చరిస్తున్నా...ఖబడ్దార్. ఇలాంటి మాటలు మాట్లాడితే భరతం పడతామని బాలయ్య హెచ్చరించారు. మీ వ్యవస్థలు తమను అడ్డుకోలేవని..అన్నింటినీ బద్దలు చేసి బుద్ది చెబుతామని బాలయ్య తేల్చి చెప్పారు.

నందమూరి వారసుల మరో అవతారం చూస్తారు..

నందమూరి వారసుల మరో అవతారం చూస్తారు..

చంద్రబాబు అలా విలిపించటం.. భువనేశ్వరి గురించి అలా మాట్లాడటం చాలా బాధ వేసిందని భువనేశ్వరి సోదరి ఆవేదన వ్యక్తం చేసారు. తమ శరీరంలో ఉన్నది ఎన్టీఆర్ రక్తమని ..మరోసారి ఇలాంటిదే జిరగితే సహించేది లేదని నందమూరి కుటుంబం హెచ్చరించింది. నందమూరి రామక్రిష్ణ జరిగిన పరిణామాలను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు.

నందమూరి వారసుల మరో అవతారం చూస్తారని హెచ్చరించారు. కొడాలి నాని.. వంశీ..అంబటి రాంబాబు..ద్వారంపూడికి వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడూ తెలియవని.. గాజులు తొడుక్కొని కూర్చోలేదని..దేవాలయం లాంటి నందమూరి కుటుంబ సభ్యుల జోతికి వస్తే సహించేది లేదని రామక్రిష్ణ హెచ్చరించారు.

English summary
Hindupur MLA and actor Balakrishna condemned the act of YSRCP over Chandrababu yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X