హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha case.. encounter నిందితుల ఎన్‌కౌంటర్‌ పై బాలకృష్ణ ... భగవంతుడే పోలీసుల రూపంలో అంటూ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Actor Balakrishna About Disha Incident

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. ఇప్పుడు దేశం మొత్తం దీనిపైన చర్చిస్తుంది. మెజారిటీ ప్రజలు పోలీసు తీసుకున్న నిర్ణయాన్ని, అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను ఎన్కౌంటర్ చేయడాన్ని సమర్ధిస్తున్నారు. ఇక సినీ వర్గాలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వీరు వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఘటనపై తమ స్పందన తెలియ చేస్తున్నారు.

Disha case.. encounter : నిందితుల ఎన్‌కౌంటర్‌ కు సీపీఐ మద్దతు .. నారాయణ ఏం చెప్పారంటేDisha case.. encounter : నిందితుల ఎన్‌కౌంటర్‌ కు సీపీఐ మద్దతు .. నారాయణ ఏం చెప్పారంటే

ఎన్కౌంటర్ పై స్పందిస్తున్న సినీ ప్రముఖుల వ్యాఖ్యలు వైరల్

ఎన్కౌంటర్ పై స్పందిస్తున్న సినీ ప్రముఖుల వ్యాఖ్యలు వైరల్

ఇక ఈ ఎన్కౌంటర్ పై సినీ ప్రముఖుల కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ సహా మంచు మంచు మనోజ్, నేచురల్ స్టార్ నాని స్పందించారు. దర్శకుడు హరీష్ శంకర్ తన బాణి వినిపించారు. నిందితులను ఎన్కౌంటర్ చేసేందుకు పోలీసులు ఉపయోగించిన ఆ బుల్లెట్ల ను దాచుకోవాలని ఉందని.. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉందని మంచు మనోజ్ అన్నారు. ఎన్కౌంటర్ చేసిన ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉందని అన్నారు.

మంచి పంచ్ ఉన్న పోస్టులు పెడుతున్న సెలబ్రిటీలు

మంచి పంచ్ ఉన్న పోస్టులు పెడుతున్న సెలబ్రిటీలు

నలుగురు చచ్చారనే వార్త లో ఇంత కిక్కు ఉందా? అంటూ మనోజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇటీవల మనోజ్ దిశ కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చిన సంగతి తెలిసిందే. ఇక తాజా ఎన్ కౌంటర్ పై నాని స్పందించారు. ``ఊర్లో ఒక్కడే రౌడీ ఉండాలి. ఆ రౌడీ పోలీసై ఉండాలి`` అంటూ నాని ట్విట్ చేశారు.

 స్పందించిన సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

స్పందించిన సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

ఇక హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ దేవుడే పోలీసుల రూపంలో దిశ నిందితులను శిక్షించాడు. దిశ ఆత్మ కు ఇప్పుడు శాంతి చేకూరింది అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీసులకు.. తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. సమాజాన్ని మార్చడానికి అప్పట్లో తన తండ్రి నందమూరి తారక రామారావు సినిమాల ద్వారా మంచి సందేశాలను ఇచ్చారని బాలయ్య పేర్కొన్నారు.

భగవంతుడే పోలీసుల రూపంలో శిక్షించాడని చెప్పిన బాలకృష్ణ

భగవంతుడే పోలీసుల రూపంలో శిక్షించాడని చెప్పిన బాలకృష్ణ

తాను కూడా లెజెండ్ వంటి సినిమాల్లో స్త్రీల గొప్పదనాన్ని గూర్చి చెప్పానని తెలుపుతూ ఓ శ్లోకం చదివారు.సందేశాత్మక చిత్రాల ద్వారా ప్రజలను మార్చేందుకు ప్రయత్నించామన్నారు. సినీ పరిశ్రమ ఆ బృహత్తరమైన బాధ్యతను నిర్వహించిందని బాలయ్య తెలిపారు. మహిళలపై దేశ వ్యాప్తంగా ఘోర ఘటనలు జరుగుతున్నాయని బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు పోలీసుల రూపంలో దేవుడే దిశ కేసులో నిందితులకు శిక్ష విధించారని బాలకృష్ణ పేర్కొన్నారు.

English summary
The murder and rape of a 26 year old veterinary doctor shook the entire nation but today the whole nation is celebrating as the accused in Disha murder case were encountered by the police. Balakrishna responds on the issue and told that they have made films which pass social message. He further added that God has come in the form of police and killed them. He stated that it should be an example and no one should dare to commit such heinous acts again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X