అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిందూపురంలో ఉత్సాహంగా బాలయ్య: బంగారు ఉంగరం పోగొట్టుకున్నారు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఉత్సాహంగా సాగింది. అయితే, బాలయ్య తన బంగారు ఉంగారాన్ని పోగొట్టుకుని తిరిగి పొందిన ఘటన చోటు చేసుకుంది.

 మహిళను మెచ్చుకున్న బాలకృష్ణ

మహిళను మెచ్చుకున్న బాలకృష్ణ

హిందూపురం పర్యటలో భాగంగా మహిళా అభిమానుల కరచాలనం సమయంలో బాలయ్య చేతికున్న బంగారు ఉంగరం కిందపడిపోయింది. దీన్ని గమనించిన ఓ మహిళ ఉంగారాన్ని తీసుకుని తిరిగి బాలకృష్ణ చేతికి తొడిగింది. సదరు మహిళ నిజాయితీని బాలయ్య మెచ్చుకున్నారు.

స్థానికులతో బాలయ్య

స్థానికులతో బాలయ్య

మరోవైపు మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పాతచామలపల్లిలో బాలయ్య పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

బాలయ్య విస్తృత పర్యటన

బాలయ్య విస్తృత పర్యటన

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అంతా విస్తృతంగా పర్యటించారు. ఇందులోభాగంగా బుధవారం ‘మూడు రోజుల పల్లె నిద్ర'కు శ్రీకారం చుట్టారు. తొలిరోజు చిలమత్తూరు మండలం చాగలేరు ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం దిగువపల్లె ఎస్టీ తాండాలో బాలకృష్ణ పల్లెనిద్ర చేశారు.

ఏరువాకలో ఉత్సాహంగా

ఏరువాకలో ఉత్సాహంగా

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరులో ఏరువాక కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నాగలి పట్టారు. ఉత్సాహంగా పొలం దున్నారు.ప్రతి యువకుడు అధునాతన పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని, ఇందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

 రైతులకు న్యాయం చేస్తాం

రైతులకు న్యాయం చేస్తాం


రాష్ట్రంలో రూ.24వేల కోట్లు రైతురుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని బాలకృష్ణ చెప్పారు. ఈ ప్రాంతంలో రైతులు లేపాక్షిహబ్‌కు భూములు కోల్పోవడం, దక్కించుకున్న సంస్థ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం, ఆ భూములు ఈడీ అటాచ్‌మెంట్‌ కావడంతో రైతులకు నాయ్యం జరగకపోవడం వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని తప్పక ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు.

Recommended Video

TDP Mahanadu 2018 : Balakrishna Speech
నిర్లక్ష్యం లేదు

నిర్లక్ష్యం లేదు

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదన్నారు. శెట్టిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శెట్టిపల్లి ఎస్సీకాలనీలో మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. దిగువపల్లితండాలో లంబాడీల నృత్యం అకట్టుకుంది. మహిళలతో కలిసి బాలయ్య కూడా నృత్యం చేశారు.

English summary
MLA Nandamuri Balakrishna three days tour started in Hindupur on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X