
హిందూపురం వైసీపీనేతలను ఆత్మరక్షణలో పడేసిన బాలయ్య... ఆ రాజీనామా ఛాలెంజ్ తో బాలకృష్ణ వ్యూహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రకటన అనేక ప్రాంతాలలో ఆందోళనకు కారణమైంది. కొత్త జిల్లాల ప్రకటన అనంతపురం జిల్లా హిందూపురం లోనూ నిరసనలకు కారణం అయ్యింది. జిల్లాల ప్రకటన చేసిన నాటి నుండి హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే హిందూపురం వాసులు బంద్ నిర్వహించి ప్రభుత్వ నిర్ణయంపై తమ నిరసన తెలియజేశారు. ఒక యువకుడు ఆత్మహత్యా యత్నం కూడా చేశారు.
హిందూపురంలో
ఎమ్మెల్యే
బాలకృష్ణ
భారీ
ర్యాలీ,
మౌన
దీక్ష;
జిల్లాకేంద్రం
కోసం
బాలయ్య
పోరుబాట

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని బాలయ్య డిమాండ్
అనంతపురం జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న సత్యసాయి జిల్లాకు జిల్లా కేంద్రంగా పుట్టపర్తి ప్రకటించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న హిందూపురం వాసులు అన్ని అర్హతలూ ఉన్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ప్రజల డిమాండ్ నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హిందూపురం ను జిల్లా కేంద్రంగా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్ సభ నియోజక వర్గమైన హిందూపురానికి జిల్లా కేంద్రానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని బాలకృష్ణ తేల్చిచెప్పారు.

హిందూపురం జిల్లాకేంద్రం కోసం బాలకృష్ణ పోరాటం
ఇక
తాజాగా
హిందూపురం
జిల్లా
కేంద్రంగా
చేయాలని
ప్రధాన
డిమాండ్
తో
హిందూపురంలో
భారీ
ర్యాలీ
నిర్వహించిన
టిడిపి
ఎమ్మెల్యే
బాలకృష్ణ,
మౌన
దీక్ష
చేపట్టారు.
ప్రభుత్వం
ప్రకటన
చేసిన
పుట్టపర్తిని
కాకుండా
హిందూపురాన్ని
జిల్లా
కేంద్రంగా
చేయాలని
బాలకృష్ణ
ప్రధానంగా
డిమాండ్
చేస్తున్నారు.
పట్టణంలోని
పొట్టిశ్రీరాములు
కూడలి
నుండి
అంబేద్కర్
కూడలి
వరకు
టిడిపి
శ్రేణులు,
జిల్లా
సాధన
కోసం
మద్దతుదారులతో
కలిసి
భారీ
ర్యాలీ
నిర్వహించిన
ఎమ్మెల్యే
బాలకృష్ణ,
మౌన
దీక్షకు
కూర్చునే
ముందు
హిందూపురం
జిల్లా
కేంద్రం
పై
తన
స్టాండ్
ను
తెలియజేశారు.

ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. వైసీపీ ప్రజా ప్రతినిధులు రెడీనా? బాలయ్య సవాల్
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హిందూపురం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఉద్యోగుల ఆందోళన నుంచి దృష్టి మళ్ళించడం కోసం ప్రభుత్వం రాత్రికి రాత్రి జిల్లాల ప్రకటన చేసిందని బాలకృష్ణ ఆరోపించారు. అన్ని వసతులు ఉన్న హిందూపురానికి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బాలయ్య డిమాండ్ చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన బాలకృష్ణ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ బాలయ్య సవాల్ విసిరారు. హిందూపురం జిల్లా కేంద్రంగా చేయాల్సిందేనని బాలయ్య తేల్చిచెప్పారు. జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళన కొనసాగిస్తామని, ఉద్యమాన్ని విరమించేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.

బాలయ్య ఇచ్చిన షాక్ తో ఆత్మరక్షణలో వైసీపీ ప్రజా ప్రతినిధులు
ఎమ్మెల్యే
బాలకృష్ణ
తాజా
ప్రకటన
వైసీపీ
నేతలను,
ప్రజా
ప్రతినిధులను
ఆత్మరక్షణలో
పడేసింది.
ఇప్పటికే
జిల్లా
కేంద్రం
తీసుకురాలేకపోయారని
వైసీపీ
నేతలపై
పెరుగుతున్న
ఒత్తిడి
తాజా
బాలకృష్ణ
వ్యాఖ్యలతో
మరింత
పెరిగింది.
బాలకృష్ణకు
నియోజకవర్గంలో
చెక్
పెట్టి
పుంజుకోవాలని
శతవిధాలా
ప్రయత్నం
చేస్తున్న
వైసీపీ
నేతల
పరిస్థితి
రివర్స్
అయ్యింది.
ముందు
నుయ్యి
వెనుక
గొయ్యి
అన్నట్టుగా
వైసీపీ
నేతల
పరిస్థితి
మారింది.
మొత్తానికి
అదును
చూసి
బాలకృష్ణ
వైసీపీ
నేతలకు
దిమ్మతిరిగే
షాక్
ఇచ్చారు.