వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక దండోపాయమే, జాగ్రత్త: మోడీకి బాలకృష్ణ వార్నింగ్, కొజ్జాలంటూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

‘ధర్మ పోరాట దీక్ష’ లో బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీకి అన్యాయం చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు.

ఎంతో మంది వీరపుత్రులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మనదని వ్యాఖ్యానించారు. తెలుగువారిని మదరాసిలుగా గుర్తిస్తున్న తరుణంలో.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి.. 9నెలల్లోనే అధికారంలోకి వచ్చారని చెప్పారు.

పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అప్రమత్తం: అతిపెద్ద కుంట్రంటూ నేతలకు జాగ్రత్తలు, అందుకేనా?పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అప్రమత్తం: అతిపెద్ద కుంట్రంటూ నేతలకు జాగ్రత్తలు, అందుకేనా?

బడుగు బలహనీ వర్గాలు, మైనారిటీ, వెనుకబడిన తరగతుల కులాలకు పైకితీసుకువచ్చి అధికార పీఠంపై కూర్చోబెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని చెప్పారు. పేదవాడి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

ఏపీకి సాయం చేస్తారనే ఆశతోనే..

ఏపీకి సాయం చేస్తారనే ఆశతోనే..

అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల లోటు బడ్జెట్‌తో ఏర్పడిన ఏపీని తన అనుభవంతో చంద్రబాబునాయుడు అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో ఏపీని అన్ని విధాలా ఆదుకుంటుందని, సహాయం అందిస్తుందనే ఆశతోనే టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుందని, ఎన్డీఏలో చేరిందని బాలకృష్ణ చెప్పారు.

ఇక దండోపాయమే.. తెలుగువాడి దెబ్బెంటే..

ఇక దండోపాయమే.. తెలుగువాడి దెబ్బెంటే..

కేంద్రంపై దాన, బేదాలు అయిపోయాయని, ఇప్పుడు దండోపాయమే జరుగుతుందని బాలకృష్ణ హెచ్చరించారు. తెలుగువాడి దెబ్బెంటే కేంద్రానికి తెలియాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు నేర్చుకోవాలని బాలకృష్ణ అన్నారు. దేశంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే రెండో భాష తెలుగేనని చెప్పారు.

గుజరాత్ కాదంటూ హిందీలో..

గుజరాత్ కాదంటూ హిందీలో..

మోడీ ఇష్టమొచ్చినట్లు పాలించడానికి ఇది గుజరాత్ కాదని, ఆంధ్రప్రదేశ్ అని బాలకృష్ణ అన్నారు. రాజకీయాల్లో మోడీ కంటే చంద్రబాబు సీనియర్ అని, అనుభవజ్ఞులను ఎలా గౌరవించాలో నేర్చుకోవాలన్నారు. సామాన్య, పేద ప్రజల అవసరాలు ఏమిటో మోడీ తెలుసుకోవాలని సూచించారు. కేంద్రంపై విమర్శలు చేసిన సమయంలో బాలకృష్ణ హిందీలో మాట్లాడటం గమనార్హం. ఉత్తర, దక్షిణ భారతదేశం అంటూ రాష్ట్రాల్లో విభేదాలు సృష్టిస్తున్నారని మోడీపై బాలకృష్ణ ఆరోపణలు చేశారు.

కొజ్జాలంటూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు

కొజ్జాలంటూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు

ప్రధాని ఎవరెవరితోనో కుప్పిగెంతులు వేయిస్తూ, చిల్లర రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు.
పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేసి నిరాహార దీక్షలంటూ నాటకాలాడారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బాలకృష్ణ విమర్శించారు. ఆ రాజీనామాలు, దీక్షల వెనుక ప్యాకేజీ ఒప్పందాలున్నాయని ఆరోపించారు. బీజేపీ, వైసీపీలు కొజ్జాల్లాగా సీట్లు గెలవాలనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ, వైసీపీలకు ఒక్క ఓటు కూడా రాదని అన్నారు. బీజేపీని తరిమికొడదామని అన్నారు.

తరిమికొట్టే రోజులు..

తరిమికొట్టే రోజులు..

ఇక యుద్ధం మొదలైందని.. బీజేపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అప్పట్లో బీజేపీకి అధికార బిక్ష పెట్టింది ఎన్టీఆర్, చంద్రబాబులేనని బాలకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతీ ఒక్కరూ విప్లవ యోధులు కావాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

కేంద్రానికి బాలకృష్ణ హెచ్చరిక

కేంద్రానికి బాలకృష్ణ హెచ్చరిక

జాగ్రత్త.. తమ సహనాన్ని పరీక్షించొద్దంటూ కేంద్రాన్ని బాలకృష్ణ హెచ్చరించారు. తెలుగు వాళ్లంటే పిరికివారు కాదు.. రాజకీయాలకు కొత్త అర్థం ఇచ్చిన వారని అన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మోడీపై వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. ‘రాజ్యాంగంతోపాటు నీ(మోడీ) భార్యను గౌరవించడం నేర్చుకో' అంటూ మోడీకి సూచించారు. రాజకీయ గురువు అయినా అద్వానీనే మోడీ పక్కన పెట్టారని అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా మట్టి, నీళ్లు ఇచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం అంటూ బాలకృష్ణ తన ప్రసంగాన్ని ముగించారు.

English summary
Tollywood Actor and Hindupur MLA Balakrishna speaking from the venue of deeksha conveyed his birthday wishes to CM Chandrababu. He praised Chandrababu for staging hunger protest on his birthday for his native land, and also in the interest of 5 crore AP people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X