వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీటింగ్ కు బాలకృష్ణను పిలవకపోవటం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారా ? అసలేం జరుగుతుంది ?

|
Google Oneindia TeluguNews

బాలకృష్ణను సమావేశానికి పిలవకపోవడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారా ? తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు బాలకృష్ణను పిలవకుండా సమావేశం అవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి ? చిరంజీవి, నాగార్జునను సమావేశానికి పిలిచి బాలకృష్ణ అని ఎందుకు విస్మరించారు ? అంటే దాని వెనుక పెద్ద కథ ఉందని ప్రచారం జరుగుతోంది.

దేశం ఆశ్చర్యపోయే విషయం చెప్తామన్న కేసీఆర్ .. సస్పెన్స్ పెట్టిన తెలంగాణా సీఎందేశం ఆశ్చర్యపోయే విషయం చెప్తామన్న కేసీఆర్ .. సస్పెన్స్ పెట్టిన తెలంగాణా సీఎం

 తనకు సమావేశం గురించి తెలీదన్న బాలకృష్ణ

తనకు సమావేశం గురించి తెలీదన్న బాలకృష్ణ


సినిమా షూటింగ్స్ కు అనుమతి కోరుతూ సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. అయితే ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జున తదితరులు హాజరు కాగా ఈ సమావేశానికి నందమూరి బాలకృష్ణను పిలవకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఇక ఈ విషయంపై స్పందించిన బాలకృష్ణ చర్చలు జరుపుతున్నారని నాకు తెలియదు. నన్ను ఎవ్వరూ పిలవలేదు, నేను కూడా మీడియాలో చూసి తెలుసుకున్నా అంటూ పేర్కొన్నారు. బాలకృష్ణను సమావేశానికి పిలవకపోవడంతో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారమే లేచింది.

బాలకృష్ణను పిలవకపోవటంపై స్పందించిన సినీ వర్గాల వ్యాఖ్యలతో మరింత దుమారం

బాలకృష్ణను పిలవకపోవటంపై స్పందించిన సినీ వర్గాల వ్యాఖ్యలతో మరింత దుమారం

ఇక బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత సి కళ్యాణ్ స్పందిస్తూ సమావేశాలకు ఎవరు అవసరం అని భావిస్తే వారిని పిలుస్తామని వ్యాఖ్యలు చేయడం బాలయ్య ఆగ్రహానికి కారణమైంది. ఆ తరువాత బాలకృష్ణ'మీటింగ్స్ పెట్టుకొని భూములు పంచుకుంటున్నారని' వ్యాఖ్యానించారు. దాంతో ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. బాలకృష్ణ ఆవేశపరుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతాడు అంటూ నిర్మాతలు , నటులు విమర్శలు గుప్పించడం మరింత వివాదంగా మారింది. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలతో స్పందించిన నాగబాబుమీరు కింగ్ ఏమి కాదు ఆఫ్టరాల్ యాక్టర్ అంతే అంటూ బాలకృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

 చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ .. తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు

చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ .. తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక ఈ రోజు మరోసారి చిరంజీవి ఇంట్లో భేటీ అయిన సినిమా పెద్దలు బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చించారు.ఆరోజు మీటింగ్ కు చిరంజీవిని , నాగార్జునను పిలవమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారనితమ్మారెడ్డి భరద్వాజ పేర్కొనడంతో మరో కొత్త చర్చ మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ చిరంజీవిని , నాగార్జునని పిలవమని చెప్పడం బాలయ్య అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. కావాలనే బాలకృష్ణను సీఎం కేసీఆర్ మీటింగ్ కు పిలవకుండా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 సీఎం కేసీఆర్ చెప్పటంతోనే చిరంజీవిని, నాగార్జునని పిలిచామని వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ చెప్పటంతోనే చిరంజీవిని, నాగార్జునని పిలిచామని వ్యాఖ్యలు


నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ వాడు కావడం ,పైగా ఆంధ్ర ఎమ్మెల్యే కావడంతో కేసీఆర్ బాలయ్యను పక్కన పెట్టారని అందుకే కేవలం చిరంజీవి నాగార్జునను మాత్రమే పిలవాలని చెప్పారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక సీఎం కెసిఆర్ బాలకృష్ణ చంద్రబాబు పార్టీలో ఉండడం, టిడిపి ఎమ్మెల్యే గా ఉండడం నచ్చక చంద్రబాబు పేరు చెప్తేనే మండిపడే నేపథ్యంలో సినీ ప్రముఖులతో జరిగిన మీటింగ్ కు బాలయ్య రాకుండా చెక్ పెట్టారని సోషల్ మీడియాలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Recommended Video

Akkineni Nagarjuna, Rajamouli, Trivikram Giving Grossery Kits To Film Workres
సీఎం కేసీఆర్ పై మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్ .. టీడీపీ అనే కేసీఆర్ ఇలా చేశారని ఆగ్రహం

సీఎం కేసీఆర్ పై మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్ .. టీడీపీ అనే కేసీఆర్ ఇలా చేశారని ఆగ్రహం

సీఎం కేసీఆర్ తీరుపై బాలయ్య ఫాన్స్ మండిపడుతున్నారు. రాజకీయాలను సినిమాలను వేరుగా చూడాల్సిన అవసరం ఉందని, ఇక రాజకీయాల కోసం సినీ ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ సర్కార్ తో షూటింగ్ ల కొనసాగింపు కోసం జరిపిన సమావేశం తాలూకు వివాదం ఇప్పట్లో సద్దుమణుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.

English summary
Telangana Chief Minister KCR said for calling Chiranjeevi and Nagarjuna for the meeting tammareddy bhardwaja made interesting comments. It is alleged that Balakrishna was deliberately prevented from calling by CM KCR intensonally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X